Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా విద్యాశాఖ అధికారి పాణినీ
నవతెలంగాణ-ములుగు
ఈ అభ్యాసన సంక్షోభాన్ని నివారించడానికి ఈ విద్యా సంవత్సరం తొలిమెట్టు కార్యక్రమం ప్రారంభించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణినీ మంగళవారం తెలిపారు. పా ఠశాల విద్య పూర్తయ్యేసరికి విద్యార్థులందరూ వారి సబ్జెక్ట్ లో నిర్దేశించిన కనీస సామర్థ్యాలు, అభ్యసన ఫలితాల సాధిం చాలి గానీ కరోనా కారణంగా ప్రాథమిక స్థాయిలో మౌళిక భాషా, గణిత సామర్ధ్యాలలో వెనుకబడి ఉన్నారని ఎన్ఏ ఎస్-21 సర్వే చెబుతుందన్నారు. ఈ అభ్యసన సంక్షో భాన్ని నివారించడానికి ఈ కార్యక్రమం చేసినట్టు తెలి పారు. ఈ అభ్యసన ఫలితాల సాధనకు ప్రతీ ఉపాధ్యా యు డు విధిగా పీరియడ్ ప్లాన్, యూనిట్ ప్లాన్, వార్షిక ప్రణాళిక రూపొం దించుకొని భోధన అభ్యసన ప్రక్రియలను అర్థవంతంగా పిల్లలు చురుకుగా భాగస్వామ్యం అయ్యేటట్లు చూడాలని కోరారు. ఈ కార్యక్రమం ఆగస్ట్ 15 న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రారంభం అవుతుందని చెప్పా రు. క్వాలిటీ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ వారంలో ఐదు రోజుల బోధ నాభ్యా సన ప్రక్రియలకు ఒకరోజు మూ ల్యాంకనంకు కేటాయిం చాలని సూచించారు. పాఠ్య పుస్తకాల ఆధారంగా అభ్యసన ఫలితాల సాధనకు కృషి చేయాలని చెప్పారు. ప్రారంభ పరీక్ష తరువాత ప్రతీ వారం విద్యార్థి ప్రగతిని మూల్యాంకనం చేయాలని చెప్పారు. మాసానికి ఒకసారి విద్యార్థి ప్రగతిని నమోదు చేయాలని చెప్పారు. ఈ కార్య క్రమము ను స్కూల్ కాంప్లెక్స్ స్తాయిలో కాంప్లెక్స్ ప్రధానో పాధ్యాయులు, మండల స్థాయిలో మండల విద్యాధికారి, నోడల్ అధికారి, జిల్లా స్తాయిలో విద్యా శాఖ అధికారి, సెక్టోరల్ అధికారులు పర్యవేక్షణ చేస్తారని చెప్పారు. ఈ శిక్షణా కార్యక్రమములో ప్రతీ మండలం నుండి నలుగురు సబ్జెక్ట్ ఉపాధ్యాయుల చొప్పున మొత్తం 36 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వీరు జూలై 30 నుండి ఆరు రోజుల పాటు మండల స్తాయిలో రెండు విడతలుగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిసిఈబి సెక్రెటరీ విజయమ్మ,ములుగు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు మరియు రిసోర్స్ పర్సన్ లుగా కోకిల రంగం, దేవి వర ప్రసాద్, లావుడ్యా రమేష్, మాతంగి మధు లు పాల్గొన్నారు.