Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిషేధిత కరపత్రాలు స్వాధీనం
నవతెలంగాణ-వెంకటాపురం
ముగ్గురు మావోయిస్టు కొరియర్లను అరెస్ట్ చేసి వారి నుండి ప్రభుత్వ నిషేధ మావోయిస్టుల కరపత్రాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై జి. తిరుపతి తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కాగితోజు శివప్రసాద్ వివరాలు వెల్లడిం చారు. ఈ నెల 28 నుంచి ఆగస్టు 5 వరకు మావోయిస్టు వారోత్సవాలను జరుపు కోవాలని మావో యిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపధ్యంలో ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలోని కొండాపురం గ్రామశివారుల్లో ఎస్సైలు తిరుపతి, ఆర్.అశోక్, సీఆర్పీఎప్ ,ప్రత్యేక బలగాలతో కలసి వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా కొండాపురం నుంచి ఆలు బాక వైపుకు వెళ్తున్న ముగ్గురిని తనిఖీ చేయగా వారి వద్ద నిషే ధిత మావోయిస్టు కరపత్రాలు గుర్తించామని తెలిపారు. వారిని విచారించగా కొండాపురం గ్రామానికి చెందిన సోమయ్య, సత్యం, సురేష్‌గా తెలిపారు. వారు మావోయిస్టు పార్టీ పాటలకు ఆకర్షితులై 2018 నుంచి ఆగ్రనాయకులకు భోజనం, ముం దులు సరఫరా చేస్తున్నట్లు వివరించారని తెలిపారు. మావో యిస్టుల అగ్రనాయకులు, వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ ఆదేశాల మేరకు ఈ నెల 28 నుంచి అగస్టు 5 వరకు జరగనున్న మావోయిస్టు వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను కొండాపురం బ్రిడ్జి వద్ద వడిచి వెళ్లేందుకు వెళ్తున్నట్లు విచారణలో తెలిపినట్లు సిఐ శివప్రసాద్ తెలిపారు.