Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితబంధులో రాబందులు
- ఆగస్టు 7 నుండి సంగారెడ్డిలో రాష్ట్ర 3వ మహాసభలు
- కేవీపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-ఖిలావరంగల్
రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ కోసం పోరాటాలు చేస్తా మని కేవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు అన్నారు. కేంద్ర బీజేపీ అనుసరిస్తున్న విధానాలు రాజ్యాం గం, రిజర్వేషన్ల రద్దు దోహదం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు రాబందుల పాలవుతుందని విమర్శించారు. మంగళవారం కెవిపిఎస్ వరంగల్ జిల్లా స్థాయి విస్తత సమావేశం కెవిపి ఎస్ జిల్లా అధ్యక్షులు హన్మకొండ ఆనంద్ అధ్యక్షతన శివ నగర్ రఘునాధ్ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడుతూ కెవిప ిఎస్ రాష్ట్ర మూడో మహాసభలు ఆగస్టు 7 నుండి 9 వరకు సంగారెడ్డిలో జరుగనున్నాయని చెప్పారు. ఆగస్టు 7న నీలి దండు కవాత్ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేరళ దేవాదాయ శాఖ మంత్రి, డీఎస్ఎంఎం జాతీయ అధ్యక్షులు కె రాధా కృష్ణన్ ప్రధాన వక్తగా పాల్గొంటారని చెప్పా రు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళి తులపై దాడులు దౌర్జ న్యాలు పెరిగాయన్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి అశాంతి సృష్టింస్తుందని విమ ర్శించారు. రాజ్యాంగ మూల స్థంబాలను కూల్చు తుం దన్నారు. దళిత బంధు కోసం విశాల ఐక్య ఉద్య మం చేపడుతామని చెప్పారు కెవిపిఎస్ జి ల్లా కార్యదర్శి అరూరి కుమార్ జిల్లా దళితుల సమస్యలను భవి ష్యత్ కర్తవ్యాలను వివరిం చారు. సమావేశంలో కెవి పిఎస్ జిల్లా నాయకులు ఉసిల్ల కుమార్, పొడేటి దయా కర్, ఆవుల ఉదరు, మౌనిక సంజీవ, భాస్కర్, రామంచ రాజు, మస్తాన్ రవి ఇమ్మడి శ్రీనివాస్, భరత్, సంజీవ, ఇస్మాయిల్ పాల్గొన్నారు.