Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-వరంగల్
పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక యాప్లో నమోదైన 6224 ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కారం చేయు టకు మేయర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మే యర్ మాట్లాడుతూ పారిశుద్ధ్యం పటిష్టంగా జరిగాలని, మంచినీటి సరఫరాలో అంతరాయం జరుగకుండా చూడా లని, పన్ను బకాయిలు వసూళ్లలో వేగం పెంచాలని అన్నా రు. అనధికారిక లే అవుట్లు, నిర్మాణాలు జరగకుండా కఠి నంగా వ్యవహరించా లని సూచించారు. శిథిలావస్థ భవ నాల తొలగింపులో జాప్యం చేయవద్దని తెలిపారు. హరి తహారం లక్ష్యం మేరకు నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉం చాలని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగించకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, స్టాంప్ వేసిన జంతువులు మాత్రమే వధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో కోతుల, కుక్కల బెడద కు చర్యలు చేపట్టాలని కోరారు. సమవేశం లో సిపి వెంకన్న, సెక్రటరీ విజయలక్ష్మి, సిహెచ్ఓ శ్రీనివాసరావు, సీఎంహెచ్ఓ డాక్టర్ జ్ఞానేశ్వర్, ఎంహెచ్వో డాక్టర్ రాజేష్, డీసీలు జోనా, శ్రీనివాస్ రెడ్డి, అకౌంట్ అధికారి సరిత తదితరులు పాల్గొన్నారు.