Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అల్లం అప్పయ్య
నవతెలంగాణ-ములుగు
ఆర్బిఎస్కే బందాలు అవసరాలను బట్టి మెడికల్ క్యాంపులు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆదేశించారు. డీఎంహెచ్వో కార్యాల యంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (అర్బిఎస్కె) వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో డాక్టర్ అప్పయ్య మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సం ద ర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కార్యక్ర మం లో వ్యాక్సిన్ తరలించేందుకు ఆర్బీఎస్కే వాహనాలను షిఫ్టు పద్ధతిలో ఉపయోగించాలని కోరారు. పాఠశాల మెడికల్ క్యాంపుల్లో స్పెషాలిటీ అవసరం ఉన్న విద్యా ర్థులకు జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచిం చారు. షిఫ్ట్ పద్ధతిలో ఉన్న ఆర్బిఎస్కే టీమ్స్ కాకుండా మిగతా టీమ్స్ ప్రోటోకాల్ ప్రకారం విధులు నిర్వర్తిం చాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విపిన్, డిఐఓ, అర్బిఎస్కె జిల్లా కో ఆర్డినేటర్, ఆర్బిఎస్కె వైద్యాధికారులు డాక్టర్ మల్లి కార్జున్, డాక్టర్ జయప్రద, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీల త, డాక్టర్ నర్సింగ్ రావు, డాక్టర్ పుష్పలీల, డాక్టర్ బండి శ్రీనివాస్, డాక్టర్ అభినందన్ రెడ్డి, డాక్టర్ స్వప్న, డాక్టర్ ఉమా మహేశ్వరి, డాక్టర్ నరహరి, పాల్గొన్నారు.