Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ్ణ
నవతెలంగాణ- దంతాలపల్లి
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ్ణ కోరారు. గురువారం మండల కేంద్రంతో పాటు బొడ్లాడ,పెద్ద ముప్పారం, గున్నేపల్లి,కుమ్మరికుంట్ల,రేపొని, గ్రామలల్లో ఎంపీపీఎస్, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో యూటీఎఫ్ దంతాలపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు, సమస్యల సేకరణ నిమిత్తం క్యాంపెనియన్ నిర్వహించారు. ఈ సందర్బంగా మురళీకష్ణ మాట్లాడుతూ... పాఠశాలు ప్రారంభమై రెండు నెలలుగా గడుస్తున్నా పాఠ్యపుస్తకలు అందించలేదని అన్నారు. పాఠశాల నిర్వహణకు నిధులు విడుదల చేయలేదని అన్నారు. కనీసం స్కావెంజర్ల నియామకం చేపట్ట లేదని విమర్శించారు. అనంతరం పలువురు ప్రధానోపాధ్యాయులు పాఠశాలల సమస్యలు సంఘం దష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొండ నాగమల్లయ్య, మండలం అధ్యక్షులు కొండ యాకయ్య, ప్రధాన కార్యదర్శి కొమ్మన బోయిన వంశీకష్ణ , మండల ఉపాధ్యక్షులు భూక్య పార్వతీ రాథోడ్,రాపోలు విజరు,కార్యదర్శి రామారావు, చిరంజీవి, పాల్గొన్నారు.