Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ పట్టణంలోని భవన నిర్మాణ కార్మికులకు అడ్డా స్థలం కేటాయించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు కోరారు. గురువారం సీఐటీయూ అను బంధం భవన నిర్మాణ, ఇతర కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, లేబర్ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం లేబర్ అధికారి రమేష్‌కు వినతి పత్రాన్ని అందజేసి ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. భవనిర్మాణ సంక్షేమ బోర్డులో కార్మికులందరిని నమోదు చేయాలన్నారు. అనేకమంది కార్మికుల కార్డులు ల్యాప్స్ అవుతున్నాయని, వెంటనే రెన్యువల్ చేయాలని కోరారు. కార్మికుడు ఒకసారి కార్డు తీసుకుంటే జీవితకాలం ఉండే విధంగా నిర్ణయం చేయాలని కోరారు. పెండింగ్ క్లైమ్స్ పరిష్కరించాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు బైకులు ఇస్తామని హామీని నెర వేర్చాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు రూ.10 పింఛను అందజేయాలని కోరారు. కార్మిక చట్టాల సవరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు అందజే యాలని కోరారు. సీఐటీయూ పట్టణ కన్వీనర్ కుమ్మరికుంట్ల నాగన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు గారే కోటేశ్వరరావు, బానోత్ శంకర్, సర్వన్, యాకయ్య, వెంకన్న, లాలు తదితరులు పాల్గొన్నారు.
క్లెయిమ్స్ పరిష్కరించాలి : సీఐటీయూ
తొర్రూరు : ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కుంట ఉపేందర్ డిమాండ్ చేశారు. సీఐటీయూ మండల కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మికులంతా తొర్రూరు అసిస్టెంట్ లేబర్ కార్యా లయం వరకు ర్యాలీగా వచ్చి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అసిస్టెంట్ లేబర్ కార్యాలయ అధికారి సుమతికి అంద జేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ సంక్షేమ బోర్డు ద్వారా కార్మికుల సంక్షేమానికి ప్రతి పైసా ఉపయో గించాలని అన్నారు. సంక్షేమ బోర్డులో విచ్చలవిడి అవినీతి జరుగుతోందని, కోట్ల రూపాయలు పక్కదారి పడుతు న్నాయని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల నిధులున్నా కార్మికుల సంక్షేమానికి కేటాయించిందేమీ లేదన్నారు. 60 ఏండ్లు దాటిన భవన నిర్మాణ కార్మికుడికి రూ.5వేల పింఛను అందజేయాలని, కార్మికులకు భవన నిర్మాణ పనిముట్లు, మోటార్ సైకిల్స్ అందజేయాలని అన్నారు. అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కార్మిక శాఖలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తాటబోయిన శ్రీశైలం, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు దుండి వీరన్న, బాబు గౌడ్, ఎండీ యాకూబు, మోహన్, ఉప్పలయ్య, యాదగిరి, వీరభద్రం, వెంకన్న పాల్గొన్నారు.