Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, అర్హులైన పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు శెట్టి వెంకన్న డిమాండ్ చేశారు. గురువారం రైతు సంఘం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక మంగపతిరావు భవనంలో సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ... కేంద్రంలో మోడీ అధికారంలో కొచ్చాక నిత్యవసర వస్తువులు, ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుతోందని విమర్శించారు. బీజేపీ తీసుకొచ్చి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్య ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీని పటిష్టంగా అమలు చేయాలన్నారు. పోడు రైతులకు హక్కుపత్రాలు, ఇంటి స్థలం ఉన్న వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ నేడు విస్మరించారని అన్నారు. ఆగస్టు 1-14వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 1న జిల్లా కేంద్రంలో ర్యాలీ, 3న జిల్లా కేంద్రంలో, 5న రాష్ట్ర కేంద్రంలో సెమినార్లు, 8న జిల్లా వ్యాప్తంగా క్విట్ ఇండియా పాటించడం, 14న జన జాగారం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో అయా సంఘాల జిల్లా నాయకులు గడ్డిపాటి రాజారావు, కందునూరి శ్రీనివాస్, వంగూరి వెంకటేశ్వర్లు, భాగం లోకేశ్వరావు, గుండెటి వీరభధ్రం, ఇమ్మడి వెంకన్న, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.