Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపల్లి
మారుమూల గ్రామాల అభివద్ధి కోసం కేసీఆర్ పెద్దపీఠవేశారని, అన్ని వర్గాలకు సముచిత స్థానాన్ని కల్పిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం రఘునాథపల్లి మండలం శివాజీనగర్‌లో రూ.10లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిరుపేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్‌తోపాటు పాల ధరలను పెంచుతూ పేదలపై భారం మోపుతోందన్నారు. రూపాయి మారకం విలువ అత్యంత పతనస్థాయికి చేరుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలను ప్రతిఘంటించాలన్నారు. అభివద్ధిలో స్టేషన్‌ఘన్‌పూర్ రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. రఘునాథపల్లి మండలాన్ని జిల్లాలోనే అభివద్ధిలో ప్రదమస్థానంలో ఉండేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమురయ్య, ఎంపీటీసీ బొల్లపల్లి సరోజన వెంకటస్వామి, జెడ్పీటీసీ బొల్లం అజరు మణికంఠ, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వారాల రమేష్‌యాదవ్, మూసిపట్ల విజరు, టీఆర్ఎస్ నియోజవర్గ మహిళ ఇన్చార్జి మట్లపల్లి సునితరాజు, సోషల్ మీడియా ఇన్చార్జి తిప్పారపు రమ్య బాబురావు, తదితరులు పాల్గొన్నారు.