Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
అర్హులైన దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని కేవీపీఎస్ మండల కమిటీ డిమాండ్ చేసింది. గురువారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్ళి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహశీల్దార్ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం నిడికొండ మారయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మండా రాజన్న, కేవీపీఎస్ జిల్లా నాయకులు నిడికొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... అర్హులందరికి దళితబంధు ఇసామన్న సీఎం ఎనిమిది నెలలు కావస్తున్నా ఇవ్వడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతి నిధులు, నాయకులు వారికి అనుకూలంగా ఉన్నవారికే ఇచ్చేలా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపిం చారు. అర్హులకు దళితబంధు ఇవ్వకుంటే తహసీల్ధార్ కార్యా లయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో నాయకులు నిడికొండ చిన్న మారయ్య, కన్నయ్య, బుజ్జిబాబు, గంజాయి వెంకన్న, జాన్ పాల్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
మరిపెడ : జిల్లావ్యాప్తంగా దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డెల రాంమూర్తి కోరారు. గురువారం స్థానిక భార్గవి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కెేవీపీఎస్ మరిపెడ మండల మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా లక్షా,22వేల దళిత జనాభా, 35,726 దళిత కుటుంబాలు ఉంటే 250మందికి మాత్రమే దళితబంధు వచ్చిందని, మిగిలిన వారికి కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దళితకాలనీలు నేటికీ ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పకడ్బందీగా అమలుజేయాలన్నారు. మహిళలపై జరుగు తున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం చేయా లన్నారు. దళితబంధు ఎంపికలో అధికార పార్టీ నాయకుల జోక్యం లేకుండా చూడలన్నారు. కులాంతర మతాంతర వివా హాలు చేసుకున్న ప్రతి ఒక్కరికి రూ.5లక్షల ప్రభుత్వ ప్రోత్సా హం అందించాలని కోరారు. దళిత సమస్యల పరిష్కారానికి కేవీపీఎస్ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆగస్టు 7, 8,9 తేదీల్లో సంగారెడ్డి లో నిర్వహించే రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు గా మల్లెపాక విజరు, అధ్యక్షులుగా తప్పట్ల విజరు కార్య దర్శిగా జె లచ్చయ్య, ఉపాధ్యక్షులుగా గాజుల రవి, జి వీరభద్రం, కోశాధికారిగా పత్తిపాటి వినరు, సహాయ కార్యదర్శిగా ఎన్ నవీన్, కార్యవర్గ సభ్యులుగా సిహెచ్ వెంకటేష్, జినక అశోక్, వడ్లకొండ ఉప్పలయ్య, మధ్యల రంజిత్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్య క్షులు జిన్నా లచ్చన్న, జిల్లా నాయకులు పులిపాక నాగరాజ్, మరిపెడ మండల జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు గోపి రమేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు పెద్దబోయిన వీరబాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి రాంబాబు, చర్మకారుల సంఘం మండల అధ్యక్షుడు బిక్షం పాల్గొన్నారు.