Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
యూనెస్కో నిబంధనలకు అనుగుణంగా రామప్ప అభివద్ధి పనులను చేపడతామని జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో పాలంపేట ఏరియా అభివద్ధి కమిటీ గురువారం తొలి సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. పాలంపేట అథారిటీ స్టేట్ కమిటీ డైరెక్టర్ టూరిజం అండ్ కల్చరల్ డైరెక్టర్ సందీప్ కుమార్ సుల్తానియా ఆహ్వానించామని, అభివద్ధి కమిటీ మెంబర్ పాండురంగారావు, ప్లానింగ్ అధికారి కన్వీనర్ గా కమిటీని సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించి ఆగస్టు నెలలో సిఎస్ఆర్ అధ్యక్షతన కమిటీ వేసి రామప్పకు వారసత్వ సంపద గుర్తింపు పొందినందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివద్ధి పనులు ప్రతిపాదనలు నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టి రోడ్డును బాక్స్ పద్ధతిలో కల్వర్టు నిర్మించి ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ప్రపోజల్ చేసి రామప్ప చుట్టుపక్కల ఉన్న ఏడు దేవాలయాలను సుమారు 11 కోట్ల రూపాయలతో రామప్పలో పనులు చేపట్టి పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, కాకతీయ హెరిటేజ్ ప్లానింగ్ మెంబర్ పాండురంగారావు, ఐటీడీఏ పీఓ అంకిత్, జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు ఇలా త్రిపాటి, అడిషనల్ కలెక్టర్ గణేష్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.