Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
జిల్లాలోని చిరుద్యోగులకు, గహిణులకు, చిన్నతనంలో చదువుకునే అవకాశం లేకుండా ఉన్న నిరక్షరాస్యులు ఓపెన్ స్కూల్‌ను వినియోగించుకోవాలని, అర్హులు ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లలో సంప్రదించాలని డీఈఓ పాణిని తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తులు ఆగస్టు 14 లోగా, అపరాధ రుసుముతో 29 ఆగస్ట్ వరకు స్టడీ సెంటర్ లో గానీ, ఆన్లైన్ లో గానీ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇందులో వత్తి విద్యా కోర్సులు కూడా ఉంటాయని, అవసరం ఉన్నవారు వాటికి కూడా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా అన్ని వివరాలతో కూడిన పోస్టర్, కరదీపిక, ప్రోస్పెక్టస్ ను జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు బద్దం సుదర్శన్ రెడ్డి, సాంబయ్య, డిసిఇబి కార్యాదర్శి ఎన్నెమ్ విజయమ్మ, జిల్లా సైన్స్ అధికారి,ఏసిజిఈ అప్పని జయదేవ్, సహాయ కార్యదర్శి యాసం విక్రమ్ రాజ్, ఉపాధ్యాయులు శిరుప సతీశ్ కుమార్, వేం యాకూబ్‌రెడ్డి, బానోత్ దేవ్‌సింగ్, సానికొమ్ము ముకుంద రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.