Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ ముంజల భిక్షపతి
నవతెలంగాణ-ములుగు
ప్రస్తుత పార్లమెంటరీ సమావేశాల్లో గిరిజన యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడారు. గిరిజన యూనివర్సిటీని వేరే ప్రాంతాలకు తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ములుగు అగ్నిగుండంగా మారుస్తామని చెప్పారు. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ వద్ద స్థల సేకరణ కూడా పూర్తి చేసినట్టు తెలిపారు. జాకారం వైటిసి భవనంలో తరగతులు ప్రారంభిస్తామని అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చినారని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలోని జాకారం గట్టమ్మ వద్ద గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన యూనివర్సిటీని అదిలాబాద్ ఉట్నూర్ కు తరలిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని ఆయన హెచ్చరించారు. గిరిజన యూనివర్సిటీ కోసం గత ఐదారు సంవత్సరాల నుండి ఉద్యమం కొనసాగుతుందని, గిరిజన యూనివర్సిటీ కోసం ఉద్యమాలను ఉధతం చేస్తామని ఆగస్ట్ 1న కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తామని, 5వ న పసర ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో దీక్ష చేస్తానని వెల్లడించారు.7 న అంబేద్కర్ విగ్రహం ముందు బ్లాక్ నిరసన తెలియజేస్తామని, 9న గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇస్తామని, 11న చెప్పులు కుట్టే వారికి వినతిపత్రం ఇస్తామని తెలిపారు. నిరసన కార్యక్రమాలకు రాజకీయాలకు అతీతంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, వైఎస్సార్టీపీ, బీఎస్పీ, తదితర పార్టీలు, కులసంఘాలు కలిసి రావాలని కోరారు. సమావేశంలో నాయకులు అహ్మద్ భాషా, ఆర్టీసీ జేఏసీ నాయకులు సారయ్య, రమేష్, శ్రీనివాస్, స్వప్న, రవి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.