Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమంగా ముటేషన్ చేసుకున్నాడని బాధితుడి ఆవేదన
- కూల్చివేతలను ఆపాలంటున్న బాధితుడు ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ నడిబొడ్డున బహుళ అంతస్తులు ఉన్న ఏక శిలా పాతభవనాల కూల్చివేతలు వివాదాస్పదంగా మారా యి. చాలా ఏళ్ల నుండి న్యాయపరమైన చిక్కుల్లో పడి పడా వుగా మారింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఇరు వర్గాల లో ఒక్కరూ కోర్టు నుండి తమకు అనుకూలంగా వచ్చిం దని, పురాతన భవనాలను కూల్చివేసినపుడు అందులో కొంతమంది తీవ్రంగా గాయ పడి,ఆస్పత్రి పాలైన విషయం విదితమే, అప్పటి నుండి కొన్ని రోజులు వరకు కూల్చివేతల జరగా ల్ఱెదని తెలిపారు. మళ్లీ కూల్చివేతలు మొదలు కావ డంతో బాధితుడు నవతెలంగాణ పత్రికను ఆశ్రయించారు. బాధితుడి ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పూర్తి గా డబ్బులు ఇవ్వక ముందే చెక్కులు ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేసు కొని అక్రమంగా మ్యూటేషన్ క్షుడా చేసుకున్నారని,ఈ విషయంపై కోర్టులో కేసు వేశామని తెలిపారు.అప్పటినుండి ఇప్పటివరకు పడావుగా వున్నది. ఇప్పుడు మాత్రం చట్టవి రుద్ధంగా ఏక శిలా పురాతన భవనంను పేలుడు పదార్థా లతో కూల్చివేస్తున్నా రని, కోర్టులో వివాదం ఉండటంతో పాటు కూల్చివేతలకు ఎటువంటి అనుమతులు లేవని, సద రు పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసామని, ఇప్ప టికే సగం వరకు కూల్చివేశారని తెలిపారు.శుక్రవారం మళ్లీ ఏకశిలా ను కూల్చివేస్తుంటే 100 కు డయల్ చేయగా పోలీ సులు వచ్చి చూసి పోయారని, పోలీసులను ఆశ్రయిం చినా ఫలితం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్ప టికై నా సంబంధిత అధికారులు పట్టించుకోని కూల్చి వేతలను ఆపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.ఈ విషయంపై సంబంధిత సీఐ రమేష్ ను వివరణ కోరగా గతంలో ఏక శిలా పురాతన భవనం పేలుళ్లతో కూల్చి వేస్తు న్నారని తమకు అందిన సమాచారం మేరకు వెళ్లిత్ఱె,సివిల్ తగాదాల్లో పోలీసులు వచ్చారని తమపై రిట్ వేశారని తెలి పారు .మళ్లీ సివిల్ తగాదాల్లో కి వెళ్ళమని కోర్టులో రాసి ఇచ్చాము. ఈరోజు మళ్లీ కూల్చివేస్తున్నారని 100 కు డయ ల్ చేయగా పోలీసులు వెళ్లారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బం దులు కలిగిన చర్యలు తప్పక తీసుకుంటామని తెలిపారు. సివిల్ తగాదాలు వారు కోర్టులో చ్షుసుకోవాలని తెలిపారు.