Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం 26,000 ఇవ్వాలి
- వీఏఓ జేఎసీ చైర్మన్ అక్కల ప్రమీల
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి ఐకేపీ వీఏవోలను సెర్ప్ ఉద్యోగులు గుర్తించి, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని వీఏఓ జాయింట్ యాక్షన్ కమిటీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చైర్మన్ అక్కల ప్రమీల, కన్వీనర్ జాడి శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రామాలయంలో లో సంఘం మండల అధ్యక్షులు మేకల చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్నధరలకు అనుగుణంగా వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, అర్హులైన వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించా లన్నారు. కార్యక్రమంలో వివిధ మండల బాధ్యులు సంపత్, అనిల్, బిక్షపతి, రాజయ్య, పద్మ, స్వరూప, శ్రీదేవి, స్వప్న, మహేష్, లలిత, నిమ్మ కంటి సంపత్, బాపు, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.
వివోఏ జిల్లా జెఎసి చైర్మన్‌గా ప్రమీల..
జేఏసీ జిల్లా చైర్మన్‌గా అక్కల ప్రమీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రామాలయం ఆవరణంలో జరిగిన సమావేశంలో నూతన జేఏసీ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా కన్వీనర్‌గా జీడి శ్రీశైలం, కమిటీ సభ్యులుగా మేకల చంద్రశేఖర్, గంధం పుష్పలత, గజ్జల స్వరూప, కామ లలితలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జేఏసీ అభివృద్ధికి అందరూ సమష్టితో పని చేయాలని కోరారు.