Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
అంతర్జాతీయ ఆటో డ్రైవర్ల దినోత్సవ పురస్కరించుకొని ఆగస్టు 1న ఆటో డ్రైవర్ల లక్ష్యం అయిన రూ.1000 కోట్ల ఆటో డ్రైవర్ల కార్పొరేషన్ సాధన కోసం చేపట్టే మహా ర్యాలీలో ఆటో డ్రైవర్లు యూనియన్లకు అతీతంగా పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని తాడు రాష్ట్ర అధ్యక్షులు గుడిమల్ల రవికుమార్ ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉమ్మడి జిల్లా తాడు అధ్యక్షులు మహమ్మద్ అని వారి ఆధ్వర్యంలో ర్యాలీ సన్నాహక కార్యక్రమాన్ని కాలనీలోని హనుమాన్ టెంపుల్ దగ్గర జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆటో డ్రైవర్లతో కలిసి మహా ర్యాలీగా బయలుదేరిన ఆయన స్వయంగా ఆటో నడుపుతూ తెలంగాణ జంక్షన్ మీదుగా అండర్ బ్రిడ్జి, చౌరస్తా, కాశిబుగ్గ, పోచం మైదాన్ ,ఎంజిఎం ,హనుమకొండ చౌరస్తా కాజీపేట మడికొండ వరకు ర్యాలీని నిర్వహించారు. ఎంజిఎం సర్కిల్లో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1, 2011లో ఆటో డ్రైవర్ లు చేపట్టిన మహా ర్యాలీలో నేటి ఆర్థిక మరియు ప్రజారోగ్య శాఖ మంత్రి తనీష్ హరీష్ రావు ఆటో డ్రైవర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి డ్రైవర్ కి ఇంటి నిర్మాణానికి ఖాళీ స్థలం, పావలా వడ్డీ ఆటో రిక్షాలు ఇప్పిస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. కార్యక్రమంలో తాడు నాయకులు సారా మహేందర్,సత్తు అంజన్న , దార సూరి ఇమ్మడిశెట్టి రాజు, ఆకునపల్లి అంజన్న , ఆవుల నవీన్ , మాస్క్ కరుణాకర్ , కోటి జోసెఫ్ , గోపన్నబోయిన రాజు, బారిగేలా కష్ణ మూర్తి , తరుణ్ , గాదెపాక కిరణ్ , లకయ్య అమంచ ప్రశాంత్, తల్ల అంజి , శ్రీకాంత్ , సజ్జ , నరేష్ , రవి , ఎల్లాగౌడ్ , కోయడం శివ , రజోజు హన్మచారి తో పాటు తాడు పదాధికారు పాల్గొన్నారు.ఫొటో పోస్టర్ ఆవిష్కరణ.
ఆటోడ్రైవర్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే
ఖిలావరంగల్ : ఆటో డ్రైవర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆగస్టు 1న నిర్వహించే తెలంగాణ ఆటో డ్రైవర్ దినోత్సవానికి సంబంధించి తెలంగాణ ఆటో ట్రాలీ డ్రైవర్ యూనియన్ పోస్టర్‌ను ఆయన శుక్రవారం శివనగర్‌లోని తన క్యాంపు కార్యాల యంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూని యన్ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జరుపుల వీరస్వామి, కుడికాల సురేష్, నరేందర్, అశోక్, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.