Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసిడిఎస్ సిడిపివో అవంతి
నవతెలంగాణ-చిట్యాల
కుటుంబ పరిస్థితులు బాగాలేవని, పిల్లల్ని సాకలే మన్న సాకుతో కన్న పిల్లల్ని అమ్మకానికి పెడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఐసిడిఎస్ సిడిపిఓ అవంతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల డెలివరీ అయిన సోనాలిని తన ఇంటికి పంపించే క్రమంలో వారి కుటుం బానికి కౌన్సిలింగ్ ఇచ్చారు. సోనాలి కుటుంబ పరిస్థి తులు బాగా లేని కారణంగా తనకు పుట్టిన శిశువును అమ్మకానికి పెట్టారన్న ప్రచారం జరగడంతో సంబం ధిత అధికారులు స్పందించి ఆమె కుటుంబ పరిస్థి తులపై ఆరా తీశారు. ఈ క్రమంలో స్థానిక అంగన్వాడీ టీచర్స్ ఆమెకు అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటు నెల రోజులు కు సరిపడా కావలసిన వస్తువులు పాలు గుడ్లు బట్టలు సీడీపివో అందించారు. ఈ సం దర్భంగా సిడిపిఓ అవంతి మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ల ద్వారా పిల్లలకు తల్లులకు అవస రమైన పౌష్టి కాహారం అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. పిల్లల పట్ల ఎలాంటి పొరపాట్లు జరిగినా ఉపేక్షించేది లేదని ఆమె చెప్పారు. కార్యక్రమం లో సూపర్వైజర్ జయప్రద అంగన్వాడీ టీచర్స్ సంధ్యారాణి, భాగ్యలక్ష్మి, భాగ్యమ్మ, అరుణ, సుజాత, ఝాన్సీ పాల్గొన్నారు.