Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బంధుతో దళిత కుటుంబాల్లో వెలుగులు
- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ-రాయపర్తి
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన భవిష్యత్ తరాల కు దిక్సూచి వంటిది అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవా రం మండలం లోని ఊకల్లో రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమా వేశంలో మంత్రి మాట్లాడుతూ దళిత బంధు దశలవారీగా పంపిణీ చేసినట్లు చెప్పారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పధకంతో దళిత సోదరుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతున్నట్లు తెలిపారు. ఎనిమిదేళ్ల స్వల్ప కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, సాధించిన విజయాలు ఎన్నో కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. రైతులు కోసం సూక్ష్మంగా ఆలోచన చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మ హేందర్ జీ, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ కిషన్, ఎంపిఓ రామ్మోహన్, పీఏ సీఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, గ్రామ సర్పంచ్ హరినాధ్, ఎంపీటీసీ రాజు, రైతుబంధు మండల అధ్యక్షుడు సురేందర్ రావు, పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు మంత్రి నివాళులు
నవతెలంగాణ-పర్వతగిరి
మండల కేంద్రంలో ఇటీవల చనిపోయిన వర్థినేని వెంకటమ్మ, చిరుకొండ సూరయ్య కుటుంబ సభ్యులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి నివాళులు అర్పించారు. మంత్రి వెంట సర్పంచ్ మాలతి సోమే శ్వర్ రావు, ఎంపి టిసి మాడుగుల రాజు, ఉప సర్పంచ్ రంగు జనార్దన్, నాయకులు వెంకటేశ్వర్రావు, శ్రీనివాస్, మధు సూధన్ రావు, వేణు గోపాల్, బొట్ల కిష్టయ్య ఉన్నారు.