Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ
నవతెలంగాణ-భూపాలపల్లి
ఓపెన్ టెన్త్ ఇంటర్ విద్యను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి టీ శైలజ సూచించారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మండల విద్యాధికారులు ప్రధానో పాధ్యాయుల సమక్షంలో కరపత్రం బ్రోచర్ మరియు ప్రాస్పెక్టస్ లు విడుదల చేశారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ జిల్లాలో ఓపెన్ స్కూల్ విధా నంలో 2022-23 సంవత్సరానికి పదవ తరగతి ఇంటర్మీడియట్ కోర్సులలో అడ్మిషన్లు ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యాయని తెలిపారు. సంబం ధిత ప్రధానోపాధ్యాయులు సహాయ కోఆర్డి నేటర్లు అధ్యయన కేంద్రాల వారు తగిన ప్రచారం చేసి అడ్మిషన్లు ఎక్కువగా వచ్చేలా కృషి చేయా లన్నా రు. పూర్తి వివరాలకు దగ్గరలో గల సంబంధిత అధ్యయన కోఆర్డినేటర్లను సంప్రదించాలని తెలియజేశారు. ఆగస్టు 14 వరకు అడ్మిషన్లు ఎటు వంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించ వచ్చ న్నారు. 31 వరకు అపరాధ రుసుముతో అడ్మిషన్ పొందవచ్చని వారు తెలియజేశారు. పూర్తి వివరాలకు www.telanganaopenschool.org వెబ్ సైట్ చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం పరీక్షల నియంత్రణ అధికారి భానోత్ జుమ్ము నాయక్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం రాజేందర్ మండల విద్యాశాఖ అధికారులు దేవ, రఘుపతి, ప్రభాకర్, సురేందర్, కోఆర్డినేటర్ కాయిత లక్ష్మణ్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.