Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే చల్లా
నవతెలంగాణ-సంగెం
నిరుపేదలకు వరంలా సీఎం సహాయనిధి నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం గీసుగొండ, సంగెం, గ్రేటర్ వరంగల్ మండలాలకు చెందిన 26 మంది లబ్దిదారులకు 9,12,500 రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను హనుమకొండలోని ఆయన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరి రక్షణతో పాటు ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న ఘనత సీఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు. గీసుగొండ మండ లానికి చెందిన ఏడుగురు లబ్దిదారులకు రెండు లక్షల నలభై రెండు వేలు, సంగెం మండలానికి చెందిన పదమూడు మంది లబ్దిదారులకు మూడు లక్షల యాభై ఎనమిది వేల ఐదు వందలు, గ్రేటర్ వరంగల్ మండల పరిధిలో ఆరుగురికి మూడు లక్షల పన్నెండువేల విలువ గల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి గూడ సుదర్శన్ రెడ్డి, 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, నార్ల వాయి సర్పంచ్ కోడూరి రజిత రమేష్, తదితరులు పాల్గొన్నారు.