Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్ బెల్ట్
జిల్లా కేంద్రంలోని సింగరేణి ఏరియా జన రల్ మేనేజర్ కార్యాలయంలో శుక్రవారం సింగరేణి కాలరీస్ ఎస్సీ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ ఉద్యోగుల రిజర్వేషన్ అమలు తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఏరియా అధికార ప్రతినిధి అజ్మీర తుకారాం అధ్యక్షత వహించగా తనిఖీకి వచ్చిన కమిటీ సభ్యులకు ఏరియా జనరల్ మేనేజర్ మల్లెల సుబ్బారావు స్వాగతం పలికి, శాలువాలతో సన్మానించారు. అనంతరం కమిటీ సభ్యులు వివిధ విభాగాల్లో నమోదైన ఎస్సీ రిజర్వేషన్ల రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏరియాలోని భూగర్భ, ఉపరితల గనుల్లో , ఇతర విభాగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు పక్కాగా అమలు అవుతున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి అజ్మీర తుకారాం అధికారం తెలిపారు. కార్యక్ర మంలో డాక్టర్ ఈ.రాజేశ్వర్ ఎస్సీ అసోసియేషన్ అధ్యక్షులు, నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి, కనుకుల తిరుపతి డిప్యూటీ జనరల్ సెక్రటరీ, చంద్రశేఖర్ కమిటీ అడ్వైజర్, మాలకొండయ్య లైజన్ అధికారి , భూపాలపల్లి ఏరియా లైజన్ అధికారి చంద్రశేఖర్ రావు, శివ కేశవరావు పర్సనల్ మేనేజర్, బి. శ్యామ్ ప్రసాద్ సీనియర్ పీఓ, డి. సంజీవ్ రావు తదితరులు పాల్గొన్నారు.