Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలంలో ముమ్మర తనిఖీలు
నవతెలంగాణ- తాడ్వాయి
మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాలు నేపథ్యంలో ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఏ ఎస్ పి సుధీర్ ఆర్ కేకన్ ఆదే శాల మేరకు, పస్రా సీఐ వి శంకర్ ఆధ్వర్యంలో ఎస్సై చావళ్ల వెంకటేశ్వర రావు, అటాచ్ ఎస్సై శ్రావణ్ కుమార్ వారం రోజుల నుండి సిఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి ఉమ్మడి తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తాడ్వాయి అటాచ్డ్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ సివిల్ సిఆర్పిఎఫ్ బలగాలతో మండల కేంద్రంలో కాటాపూర్ క్రాస్ రోడ్డు, మేడారం స్తూపం వద్ద ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. తాడ్వాయి నుంచి కాటా పూర్, తాడ్వాయి నుంచి పస్రా, తాడ్వాయి నుంచి మేడారం ఉన్న రహదారిలలో ఉన్న ప్రతి మోరి, మోరి, ప్రతి బ్రిడ్జి లను తనిఖీలు నిర్వ హించారు. గుత్తి గోయగూడాలలో కార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. అను మానిత వ్యక్తుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మావోయిస్ట్ ప్రభా విత ఏజెన్సీ ప్రాంతాల నుంచి కార్యకలాపాలు సాగిస్తారనే అనుమానంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 163 వ జాతీయ రహదారి పై భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తాడ్వా యి అటాచ్డ్ ఎస్సై శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం తమకు అందించాలని సూచిం చారు. కార్యక్రమం లో హెడ్ కానిస్టేబుల్ చింత నారాయణ, కానిస్టేబుల్స్ పూజారి రమేష్, కొండ రజనీకర్, అప్పల రమేష్, సాంబయ్య,సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.