Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిడబ్ల్యూఎంసి కమిషనర్ ప్రావీణ్య
నవతెలంగాణ-వరంగల్
కార్పొరేషన్ పరిధిలో సాగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం 10వ డివిజన్లో పద్మాక్షి రోడ్డు, కాపువాడ ప్రాంతాల్లో నిర్మించిన అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఆమె పరిశీలించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని లేనిచో బిల్లులలో కోత తప్పదన్నారు. బాలసముద్రంలో నిర్వహిస్తున్న వర్మీ కంపోస్ట్ కేంద్రాన్ని కమిషనర్ పరిశీలించి మరింత సమర్థవంతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు. పరిసరాల్లో శానిటేషన్ పటిష్టంగా నిర్వహించాలన్నారు. అనంతరం భవన నిర్మాణ అనుమతుల నిమిత్తం పలివేల్పులలోని, అలంకార్ సమీపంలో నిర్మాణ స్థలాలను టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఆమె పరిశీలిం చారు. ఆమె వెంట ప్లానర్ వెంకన్న, సీఎంహెచ్ఓ డాక్టర్ జ్ఞానేశ్వర్, ఈఈ. బిఎల్ శ్రీనివాసరావు, డీఈ ఈ రవికుమార్ తదితరులు ఉన్నారు.