Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మహిళల రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేసి, వారి భద్రత కు భరోసా కల్పించాలని అఖిల భారత మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి మామిళ్ళ సుమ లక్ష్మీ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక గిరిప్రసాద్ భవనంలో వెంకట నర్సమ్మ అధ్యక్షతన జరిగిన సంఘం 2వ మహాసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళ హక్కుల రక్షణ చట్టాలను పటిష్ఠంగా అమలు చేయక పోవడంతో నిమిషానికో ఘటన అఘాయిత్యం జరుగు తోందని అన్నారు. చిన్నారులు,మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో సేవలు అందిస్తున్నారని అన్నారు. వారికి మాత్రం ప్రభుత్వాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని మండిపడ్డారు. అనంతరం మండల కార్యదర్శిగా సిరి మర్ది వెంకట నర్సమ్మ,ఉప అధ్యక్షురాలుగా ఈశ్వరమ్మ, సింధు, రాజ్యలక్ష్మీ, కమిటీ సభ్యులుగా జి.జ్యోతి, మంజు, భాగ్యలక్ష్మిని ఎన్నుకున్నారు. ఈ మహాసభలో జిల్లా అధ్యక్షురాలు మామిళ్ళ పద్మ, సీపీఐ మండల కార్యదర్శి జె.వెంకన్న,ఈశ్వరమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.