Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
గూడూరు మండల కేంద్రంలోని గిరిజన బాలురు ఆశ్రమ పాఠశాల వార్డెన్ ఈసం స్వామిని సస్పెండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రోజుల క్రితం పాఠశాలల్లోని విద్యార్థులు ఆహారం తీసుకొని అస్వస్థకు గురి కాగా సంఘటన పై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ శశాంక, ఆదేశాల మేరకు గురువారం విచారణ జరిపి నివేదికను కలెక్టర్ కు సమర్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వార్డెన్ ను సస్పెండ్ చేస్తూ డీడీ ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలికంగా పాఠశాల ఉపాధ్యాయుడు ఐలబోయిన వీరయ్యకు వార్డెన్ బాధ్యతలు అప్పగించారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై డీఎంహెచ్ఓ ఆరా...
మూడు రోజుల క్రితం మండలంలోని గిరిజన బాలుర వసతి గహంలోని విద్యార్థులు ఆహారం తిన్న తర్వాత అస్వస్థత గురికాగా గూడూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా వైద్య అధికారి హరీష్ రాజ్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. తప్పనిసరిగా ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. నాణ్యమైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. డిప్యూటీ డాక్టర్ అంబరీష, అయితపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సాయినాథ్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్లు, శివశంకర్, లావణ్య హెచ్ఈఓ లోక్య నాయక్, సూపర్వైజర్ గణేష్ పాల్గొన్నారు.