Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
ఈనెల 31(ఆదివారం) నుంచి ఫాతిమానగర్లోని బాలవికాస కేంద్రంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నాలుగవ రాష్ట్ర స్థాయి శ్రామిక మహిళా సదస్సు నిర్వహిస్తున్నారని, మహిళా ఉద్యోగులంతా పాల్గొనాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ వరంగల్ డివిజన్ వర్కింగ్ ఉమెన్ సబ్ కమిటీ కన్వీనర్ కామ్రేడ్ సీిహెచ్ మాధవి పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు ప్రముఖ రచయిత్రి నెల్లుట్ల రమాదేవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల వర్కింగ్ ఉమెన్ సబ్ కమిటీ కన్వీనర్ పి సుజాత అతిథిగా హాజరు కానున్నారు. ఈ సదస్సులో నేటి సమాజంలో స్త్రీలు ఎదు ర్కొంటున్న అనేక అంశాలపై, సంఘటిత, అసంఘటిత రంగంలో పని చేస్తున్న శ్రామిక, కార్మిక, కర్షక మహిళలు ఎదు ర్కొంటున్న వివక్ష, అసమానతలు, మహిళా సాధికారత అంశాలపై చర్చించి తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు. ఈ మహిళా శ్రామిక సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్ తెలం గాణ రాష్ట్రా లలోని 9 డివిజన్ల మహిళ ఉద్యోగులంతా పాల్గొ నబోతు న్నారు. ఈ సదస్సుకు అధిక సంఖ్యలో హాజరై విజ యవం తం చేయాలని ఉమెన్ సబ్ కమిటీ కన్వీనర్ సిహెచ్ మాధవి విజ్ఞప్తి చేశారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యూని యన్, వరంగల్ డివిజన్ అధ్యక్షులు మర్రి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి జి జగదీశ్వర్, సహాయ కార్యదర్శి వి కళ్యాణి, కోశాధికారి రేష్మా, డీఓ యూనిట్ ప్రెసిడెంట్ సంధ్యారాణి, మీడియా కన్వీనర్ ఆర్విఏ ఎల్ శారద, అమ్మాజి కవిత, రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు.