Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్ష రైతు సంఘాలు
నవతెలంగాణ-బయ్యారం
కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని వామపక్ష రైతు సంఘాలు కోరాయి. శుక్రవారం మండల కేంద్రంలో (ఎస్కేఎం) సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వామపక్ష రైతు సంఘాల నాయకులు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మండ రాజన్న, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రామగిరి భిక్షం, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.కె సైదులు పాల్గొని మాట్లాడారు. ఏడాదికిపైగా జరిగిన రైతాంగ పోరాటం ఫలితంగా ప్రధాని మోదీ రైతాంగానికి క్షమాపణ చెప్పి వారి డిమాండ్స్ అమలు చేస్తానని లిఖితపూర్వకంగా హామీనిచ్చారన్నారు. నేటికి ఏడాది గడిచిపోయినా అమలు చేయట్లేదని వాపోయారు. ఇది రైతాంగ ఉద్యమాన్ని నీరుగార్చే కుటిల ప్రయత్నంలో భాగమేనని విమర్శించారు. ఇప్పటికైనా ఏంఎస్పి పంటలకు గ్యారంటీ చట్టం చేయాలని అన్నారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, రైతాంగం పై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ ఎత్తివేయాలని, లఖింపూర్ ఖేరీలో మూకుమ్మడి హత్యాకాండకు బాధ్యుడైన కేంద్ర మంత్రి అజరు మిశ్రానుమంత్రి పదవి నుండి తొలగించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, రైతాంగ అమరవీరుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతాంగ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి బీజేపీని ద్దె దించటం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాధవ శెట్టి నాగేశ్వరరావు, తోకల వెంకన్న, తొడుసు యాదగిరి, రామ చంద్రుల మురళి, తుడుం వీరభద్రమ్, మింగు భగవాన్, రాసమల్ల ఉప్పలయ్య, చిన్న0 రమేష్, ముత్యాల భద్రయ్య, నిడికొండ చంటి, బండ రాజయ్య, నందగిరి సత్యం, రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.