Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి షాప్ ప్రారంభం
నవతెలంగాణ-బచ్చన్నపేట
ఫ్లెక్సీ ప్రింటింగ్‌ను మండల ప్రజలు వినియోగించుకోవాలని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి కోరారు. మండల కేంద్రంలోని చేర్యాల రోడ్డులోని చెక్‌పోస్ట్ పక్కన ఏర్పాటు చేసిన ఆర్ఎస్ డిజిటల్ ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్‌ను ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి కృష్ణంరాజు, పీఏసీఎస్ చైర్మెన్ పులిగిల్ల పూర్ణచంద్, సర్పంచ్ల ఫోరమ్ జిల్లా ఉపాధ్యక్షుడు గంగం సతీష్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు దూడల కనకయ్యతో కలిసి రమణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. అనంతరం రమణారెడ్డి మాట్లాడారు. మండల ప్రజలు ఫ్లెక్స్ ప్రింటింగ్ సేవలను వినియోగించుకుని నిర్వాహకుడిని ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి, అలీంపూర్ సర్పంచ్ బాల్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు షబ్బీర్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మల్లవరం వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు ప్రతాప్‌రెడ్డి, గంధమల్ల నరేందర్, వినరుకుమార్, అశోక్, సాయి, భాను, కుమార్, భూపాల్‌రెడ్డి, వెంకట్, నరేష్, అనిల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.