Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
రాష్ట్రంలో నయవంచక పాలన సాగిస్తున్న టీఆర్ఎస్కు గుణపాఠం తప్పదని జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మెకు మాజీ ఎంపీ రాజయ్యతో కలిసి రాఘవరెడ్డి ఆదివారం హాజరై మద్దతు తెలిపి మాట్లాడారు. స్వరాష్ట్ర ఏర్పాటులో సబ్బండ వర్గాల ప్రజల పోరాడగా 1200 మంది అమరులు కాగా తెలంగాణ కల సాకారమైందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలను నమ్మించి మోసం చేస్తూనే ఉందని మండిపడ్డారు. దళితులకు భూపంపిణీ, దళితుడిని సీఎం చేస్తానని, తదితర అనేక హామీలిచ్చి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి విస్మరించారని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ నమ్మి మరోసారి మోసపోకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, కార్పొరేటర్ రవి, నాయకులు చింత ఎల్లయ్య, సింగాపురం వెంకటయ్య, నాగయ్య, రాజు, రంగనాథ్, మండల అధ్యక్షురాలు చింత జ్యోత్స్న, శ్రీనివాస్, మారపాక వసంత్, కరుణాకర్, మహేందర్, వీఆర్ఏ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన దీక్ష ఏడో రోజుకు చేరుకోగా వీఆర్ఏల సంఘం మండల అధ్య క్షుడు నాలికె మహేందర్ మాట్లాడారు. కార్యక్రమంలో వీఆర్ఏలు శ్వేత, సృజన, కృష్ణంరాజు, రమేష్, మహేందర్, సురేష్, రవి, శ్రీను, రాజు, రవివర్మ పాల్గొన్నారు.
జఫర్గడ్ : మండల కేంద్రంలో వీఆర్ఏలు జేఏసీ చైర్మెన్ మేకల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో వీఆర్ఏలు కుల్లా కరుణాకర్, ఎడ్ల రవి, చీపురు కష్ణ, గొడుగు రాజా రమేష్, వెంకటేష్, నజీర్ పాషా, తదితరులు పాల్గొన్నారు.
తరిగొప్పుల : మండల కేంద్రంలో వీఆర్ఏల జేఏసీ మండల అధ్యక్షుడు తాటి ఎల్లయ్య ఆధ్వర్యంలో అర్ధనగ ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో వీఆర్ఏలు జంగ రవి, అల్లిబిల్లి కనుకయ్య, గునిగంటి రాజపోషయ్య, నందనబోయిన యాదయ్య, దిండిగాల వెంకటయ్య, భిక్షపతి, వెంకటస్వామి, నర్సింహులు, మంచినీళ్ల వెంకటయ్య, బాషబోయిన నర్సింహస్వామి, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూర్ : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మె ఆదివారం ఏడో రోజుకు చేరుకోగా వీఆర్ఏలు మోకాళ్లపై కూర్చొని అర్థనగ నిరసన ప్రదర్శన చేవారు. వీఆర్ఏల సమ్మెకు బీజేపీ మండల కమిటీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఇర్సుడ్ల సదానందం మాట్లాడారు. కార్యక్రమంలో వీఆర్ఏల జేఏసీ కన్వీనర్ వంగేటి సత్యం, బీజేపీ నాయకులు బుచ్చిరెడ్డి, వెల్దే సదానందం, వీఆర్ఏల సంఘం ప్రధాన కార్యదర్శి జంగా శ్రీకాంత్, కోకన్వీనర్ సతీష్, తాళ్ల రవి, శ్రీకాంత్, బొజ్జం వీరస్వామి, రాయకుల సారయ్య, గద్ద నర్సయ్య, పాండవుల చంద్రమౌళి, ప్రశాంత్, మాధవి తదితరులు పాల్గొన్నారు.
తల్లి కోసం తనయుడు
టేకుమట్ల :అసెంబ్లీ సాక్షిగా సీఎం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె ఆదివారం ఏడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తల్లి చేస్తున్న సమ్మెలో తన వంతుగా తనయుడు పాల్గొని మండల ప్రజలను, అధికారులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడారు. వీఆర్ఏలతో వెట్టిచాకిరీ చేయించుకొని హామీలను అమలు చేయకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో వీఆర్ఏలు కీలకమని గుర్తు చేశారు. ఇప్పటికైనా సీఎం స్పందించి హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు బాబు, ప్రధాన కార్యదర్శి స్వామి, జిల్లా జాయింట్ సెక్రెటరీ రవీందర్, కోశాధికారి సురేష్, ప్రచార కార్యదర్శులు రమేష్, అప్సర, వీఆర్ఏలు రజిత, మౌనిక, కిరణ్మయి, జితేందర్, సందీప్, స్వామి, రాజు, తదితరులు పాల్గొన్నారు.