Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-మల్హర్రావు
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లో వరద ముంపునకు పంటలు నష్టపోయిన, ఇండ్లు కూలిన బాధిత కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణ సాయం కింద ఎకరాకు రూ.15 వేల చొప్పున, ఇండ్లు కూలిపోయిన కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.10 వేలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలన్నారు. అలాగే విత్తనాలు, ఎరువులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 5న తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ముంపు బాధిత కుటుంబాలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.