Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్ విప్ వినరుభాస్కర్
నవతెలంగాణ-హనుమకొండ
జిల్లాలోని ఆటో కార్మికులను ఆదుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినరుభాస్కర్ తెలిపారు. హనుమకొండలోని తిరుపతి తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన శ్రీచక్ర పొదుపు, పరపతి పరస్పర సహాయ సహకార సంఘం రెండో వార్షికోత్సవ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా కాలంలో ఆటోకార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి సొసైటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సభ్యులు నెలకు రూ.300లు చొప్పున చేసిన పొదుపు ప్రస్తుతం కోటి రూపాయలు దాటిందని చెప్పారు. ప్రైవేట్ ఫైనాన్స్‌ల వేధింపుల నుంచి ఆటోడ్రైవర్లను రక్షించేందుకే సొసైటీని ఏర్పాటు చేశామన్నారు. ఆర్థికంగా ఆటో కార్మికులను ముందుకు నడిపించేలా మొదటి ఆర్నెళ్లపాటు తన వేతనాన్ని అందించినట్టు తెలిపారు. ఆటోడ్రైవర్ల పిల్లలకు ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించేందుకు నిధి ఉపయోగపడుతుందని చెప్పారు. మెరిట్ సాధించిన ఆటోడ్రైవర్ల పిల్లలకు ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. ఆటో కార్మికుల కోసం హెల్త్ కార్డులు, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించామన్నారు. వ్యక్తిగత రుణాలను సైతం ఇచ్చి అదుకుంటున్నామని తెలిపారు. ఆటో భవన్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. అది పూర్తయితే ఆటోడ్రైవర్ల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ లభిస్తుందని, ఉద్యోగాలు సమకూరుతాయని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మెన్ మార్నేని రవీందర్రావు, కల్పలత సూపర్‌బజార్ చైర్మెన్ వర్థమాన్ జనార్ధన్, జగన్మోహన్రావు, డీసీపీ పురుషోత్తమ్, కార్మిక నాయకుడు పుల్లా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.