Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథ్‌పల్లి
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని గబ్బెట గ్రామంలోని రోడ్లను ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రమేష్, రవిగౌడ్ మాట్లాడారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గబ్బెట గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటికీ అభివద్ధి చేయలేదని విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి, అభివృద్ధి విస్మరించారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఎమ్మెల్యే తక్షణమే స్పందించి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటనకు రాకుండా అడ్డుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గాదె మహేందర్‌రెడ్డి, మేకల నరేందర్, ఎంపీటీసీ శిరీష సురేష్, సర్పంచ్ జిట్టబోయిన రాజు, నాయకుడు పేర్న రవి, తదితరులు పాల్గొన్నారు.