Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
మండల కేంద్రంలోని బస్టాండ్‌ను పునరుద్ధరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి సోమయ్య డిమాండ్ చేశారు. బస్టాండ్‌ను పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సందర్శించి సమస్యలను పరిశీలించారు. అనంతరం సోమయ్య మాట్లాడారు. బస్టాండ్‌ను ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. కొన్నేండ్లుగా బస్టాండ్ నిరుపయోగంగా ఉంటోందన్నారు. సమస్యను జనగామ డిపో మేనేజర్‌కు పలుమార్లు వివరించినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ పశువులకు, తాగుబోతులకు అడ్డాగా మారిందని ఆందోళన వెలిబుచ్చారు. ఇప్పటికైనా ఆర్టీసీ జనగామ డిపో అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించి బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి బస్సు బస్టాండ్‌లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కాట సుధాకర్, నల్లతీగల శ్రీనివాస్, సిద్ధం సోమయ్య, బంగారి చిరంజీవి, నల్లతీగల యాకయ్య, మారపెల్లి బాబు, ఎలమకంటి యాకయ్య, పిన్నింటి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.