Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పగూడెం-కోమటిగూడెం రోడ్డు అధ్వాన్నం
- తక్షణమే మరమ్మలు చేయాలి
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
మండలంలో ఇప్పగూడెం నుంచి రంగారాయిగూడెం మీదుగా కోమటిగూడెం వెళ్లే బీటి రోడ్డు అధ్వాన్నంగా మారి ఏండ్లు గడుస్తున్న విషయాన్ని మంత్రి దయాకర్రావు, ఎమ్మెల్యే రాజయ్యలకే కాకుండా అధికారులకు విన్నవించినా నిర్లక్ష్యం వీడడం లేదని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మునిగెల రమేష్ తెలిపారు. ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రోడ్డుపై ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడారు. బీటీ రోడ్డు గుంతలుగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా స్పందించకపోతే పెద్దఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కొడెపాక యాకయ్య, ఇప్పగూడెం గ్రామ కార్యదర్శి గట్ల మల్లారెడ్డి, నాయకులు మారబోయిన మల్లయ్య, నర్సింహులు, కుర్ర ఉప్పలయ్య, పరమేష్, డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి శాతపురం రవి, సట్ల రాజు, పల్లెపు రవి, సురేష్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.