Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంటల కనీస మద్దతు ధరల చట్టం చేయాలి
- రైతు సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్లో రాస్తారోకో
నవతెలంగాణ-మట్టెవాడ
రైతాంగ ఉద్యమానికి ఇచ్చిన హామీలను విస్మరిస్తే మోడీ ప్రభుత్వ పతనం ఖాయమని ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి పెద్దారపు రమేష్, ఏఐకెఎంఎస్ ఉపాధ్యక్షులు జడ సత్యనారాయణ, ఏఐకెఎస్ జిల్లా కార్యదర్శి కోరబోయిన కుమారస్వామి, తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు రైతు సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెం టర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఓట్లు సీట్లు అధికారం ధ్యేయంగా మభ్యపెట్టే హామీలతో పబ్బం గడ పాలని దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు శతవిధాల కృషి చేస్తూ దేశ ప్రజల మధ్య మత వైష మ్యాలను రెచ్చగొట్టి రా జ్యాంగాన్ని లౌకికత్వాన్ని మార్చేందుకు కుట్ర చేస్తుం దని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగ ఉద్యమ కాలంలో రైతులపై పెట్టిన కేసులను నేటికీ ఎత్తి వేయకపోగా లకింపూర్ ఘ టనలో రైతులపై వాహ నాలను ఎక్కించి నలుగురు రైతుల మతి కారణమైన కేంద్ర సహాయమంత్రి ఆశిష్ మిశ్రా పై కనీస చర్యలు తీసుకోకపోవడం చట్ట విరుద్ధమన్నారు. కార్యక్రమానికి ఎఐకెఎస్ సిసి జిల్లా కో కన్వీనర్ రాచర్ల బాలరాజు అధ్యక్షత వహించగా ఎంసిపిఐ (యు) నగర కార్యదర్శి గడ్డం నాగా ర్జున, మహాత్మ జ్యోతిరావు పూలే సామాజిక న్యాయవేదిక బాధ్యులు కేడల ప్రసాద్, రైతు ప్రజా సంఘాల నాయకులు సింగతి సాంబయ్య, నర్ర ప్రతాప్, ఓదెల రాజయ్య, దామర కొండ కొమురయ్య, సుంచు జగదీశ్వర్, ఐతమ్ నగేష్, గోరంటల శరత్ బాబు, రాయినేని ఐలయ్య, జట్టబోయిన నరసయ్య తదితరులు పాల్గొన్నారు.