Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ప్రతిఘటన ఉద్యమ దళపతి కామ్రేడ్ పూనేం లింగన్న మూ డవ వర్ధంతి సందర్భంగా ఆదివారం సీపీఐ ఎంఎల్ న్యూడె మోక్రసీ బయ్యారం సబ్ డివిజినల్ కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని వెంకట్రామపురంలో దొరన్న స్మారక భవనంలో లింగన్న చిత్రపటానికి పుష్పగుచ్ఛాలతో విప్లవ నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ వర్ధంతి సభలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజినల్ కమిటీ కార్యదర్శి నందగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గుండాల మండలం రోడ్లగడ్డ అటవీప్రాంతంలో బూటకపు ఎన్కౌం టర్లో లింగన్నను అనేక చిత్రహింసలు పెట్టి కిరాతకంగా హత్యచేసి విప్లవోద్యమాన్ని ఆర్పివేయాలని చేసిన ప్రయో గాలన్నీ ప్రజలు తిప్పి కొట్టి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. కార్యక్రమంలో ఎస్డీఎల్సీ నాయకులు రామచంద్రుల మురళి, తోకల వెంకన్న, పీఓడబ్ల్యూ మండల అధ్యక్షురాలు బొల్లం సోమక్క, గ్రామ నాయకులు చిట్టి జగ న్నాథం, తూముల నర్సింహారావు, బిక్షం, చంద్రయ్య, కశాన బోయిన అశోక్, నర్సమ్మ, వెంకన్న, లింగయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.