Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోలింగ్ వాహనాలు పోలీసులు అటువైపు వెళ్ళకపోవడంతో రెచ్చిపోతున్న ఆకుతాయిలు
- ప్రమాదకర పరిస్థితిలో ఈతలు కొడుతూ మత్తడి చివరన కూర్చొని మద్యం తాగుతూ ప్రాణాలతో చెలగాటాలు..
- భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు
నవతెలంగాణ-మట్టెవాడ
భద్రకాళి చెరువు మత్తడి ఆకతాయిలకు, మందు బాబులకు అడ్డాగా మారింది. సాయంత్రం సమయాల్లో ఈతలు కొడుతూ చీకటి పడిన అనంతరం మత్తడి గోడలపై కూర్చొని ప్రమాదకర పరిస్థితుల్లో మద్యం తాగుతూ రెచ్చిపోతున్న వైనం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. అటుగా ఎవరైనా వెళ్లి మందలించిన వారిపై విరుచుకుపడే పరిస్థితిలో మద్యం బాబులు ఉండడంతో ఎవ్వరు ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు. పోలీ సులు , పెట్రోలింగ్ వాహనాలు అటువైపు వెళ్లకపోవడంతో మందు బాబులకు నెలవుగా మారింది. భద్రకాళి చెరువు మ త్తడి పడి నీరు వెళ్తున్న క్రమంలో కొన్ని రోజులు మట్టేవాడ పోలీసులు భారీ కేడ్లు పెట్టి పిల్లలు, యువకులు, ప్రజలను అటువైపుగా వెళ్లకుండా చూసి అనంతరం పట్టించు కోక పోవడంతో. ఇప్పుడు మందు బాబులకి అడ్డాగా మారిందని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. భద్రకాళి మత్తడికి ఆనుకొని దేవాలయం ఉన్నప్పటికీ ఆకతాయిలు అవేమి పట్టించు కోకుండా చెరువులో ఈతలు కొడుతూ మందు బాటిళ్లు తెచ్చుకొని అక్కడే తాగి తూలుతూ తమ ప్రాణాలతో చెల గా టం ఆడుకుంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఏం టని ఆకతాయిలు మందు మత్తులో అక్కడ ఉండే వారిని ఏమైనా చేస్తే ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఇకనైనా పోలీసులు అటువైపుగా ఎవరు వెళ్లకుండా ఈతలు కొట ్టకుండా చూడాలని స్థానిక కాలనీవాసులు కోరుకుంటున్నారు.