Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
నవతెలంగాణ-ధర్మసాగర్
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివద్ధిని, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తెలిపారు. హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ యూత్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారపు సుమన్, కరుణపురం యూత్ అధ్యక్షులు గుర్రపు ప్రవీణ్, ఆరూరి రవిచందర్, కొంగ రాజు అధ్వర్యంలో ఎమ్మెల్యే రాజయ్య సమక్షంలో గాదె తరుణ్, అరూరి పవన్, బైరపాక భార్గవ్, వేమునూరి పాల్సన్ రాజ్, తదితరులు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. టీఆర్ఎస్ హయాంలోనే మండలం, నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజారపు ప్రమోద్, కొల్లూరి సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.