Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధి ఫీజుల వసూలుతో బెంబేలెత్తుతున్న వైనం
- పాఠశాలలోనే నోట్ పుస్తకాలు, ఇతర సామాగ్రి కొనాల్సిందే...
నవతెలంగాణ-బయ్యారం
పిల్లలకు స్కూలు ఫీజుతో పాటు యూనిఫాం, కోత్త పుస్తకాలు, నోట్‌బుక్స్, క్యారేజీ, బ్యాగులు ఇలా అన్నింటినీ సమకూర్చడానికి ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఈసారి విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కాగా మండలంతో పాటూ, మండలానికి అతి సమీపంలో ఉన్న జిల్లా కేంద్రమైన మహాబూబాబాద్ కు అధిక సంఖ్యలో విధ్యార్థులు బస్సుల ద్వారా ప్రైవేట్ స్కూల్స్‌కు వెళ్తున్నారు. దీంతో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విధ్యార్థులను చేర్పించేందుకు ప్రైవేట్ విధ్యాసంస్థలు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించి అడ్మీషన్లు కోసం కొంత మొత్తాలను కూడా వసూలు చేసేశాయి.
ప్రస్తుతం నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో చేర్చాలంటే ప్రైవేట్ పాఠశాలల్లో రూ.20 వేల నుంచి 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంలు, ఘూ, బస్సు చార్జీలు తదితర ఖర్చుల కోసం కనీసం రూ. 10 వేలకు పైనే కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి థర్డ్ స్టాండర్డ్ వరకు ప్రైవేట్ విధ్యా సంస్థల్లో ఏడాదికి ఫీజు 20 నుంచి 50 వేల వరకు ఉంది. 4 వ తరగతి నుంచి 7 వ తరగతి వరకూ సుమారు రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. 8 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు రూ. 50 వేల నుంచి 80 వేల వరకు ఏడాదికి ఫీజు రూపంలో ప్రైవేట్ విధ్యా సంస్ధలు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్ కళాశాలల విషయానికోస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఫీజులను చూసి బెంబేలెత్తుతున్నారు. ఇంటర్ ప్రధమ సంవత్సరానికి కార్పోరేట్ విధ్యా సంస్థల్లో రూ. 70 వేల నుంచి రూ. లక్ష, ద్వితీయ సంవత్సరానికి రూ. లక్ష వరకు ఫీజుగా చెల్లించాల్సి ఉంది. పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోయినప్పటికీ అప్పులు చేసి మరీ తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్ విధ్యా సంస్థల్లో చేర్పిస్తున్నారు. ప్రైవేట్ విధ్యా సంస్థలు ఇష్టా రాజ్యంగా ఫీజులను ఏడాదికేడాది పెంచు కుంటూ పోతున్నప్పటికీ అదుపు చేసేందుకు అధికార యంత్రాంగం చొరవ చూపడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుత కాలం ప్రైవేట్ విధ్యా సంస్థల కాలమని చెప్పవచ్చు.
సామాన్యూడి అప్పుల వేట ....
నూతన విధ్యాసంవత్సరం ప్రారంభం అవుతుండటంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు అప్పుల వేట ప్రారంభిస్తున్నాయి. ఒక తరగతి నుంచి మరొక తరగతికి అదే స్కూల్లో ప్రమోట్ అయ్యే విధ్యార్థులకు అయ్యే ఖర్చు కన్నా .... కొోత్త అడ్మిషన్లు చేయాల్సి వస్తే గుండె దడ పెరిగిపోతోంది. ఒక విధ్యార్థి ఉన్న కుటుంబానికి పాఠశాలను బట్టి రూ.20వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చువుతోంది. కొందరు చిట్టీల ద్వారా అవసరమైన డబ్బులు దాచుకుంటుంటే, కూలీల కుటుంబాలు డైలీ ఫైనాన్స్‌ల ద్వారా ఆ మొత్తాన్ని సమకూర్చుకుంటున్నారు. వెయ్యికి రూ.3 వడ్డీ ఉండగా, డైలీ ఫైనాన్స్ అయితే రూ. 10 వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఉన్నత చదువులు చదివే విధ్యార్థులుంటే బ్యాంకు రుణాలను తీసుకుంటున్నారు. నెలకు రూ.10 వేలు సంపాదించే కుటుంబం ఒక నెలలో అదనంగా రూ.20వేలు ఖర్చు చేయాలంటే తలకు మించిన భారమే అవుతుంది. ఇక హాస్టల్లో చదువుకుంటున్న విధ్యార్థుల తల్లిదండ్రులకు మరింత భారంగా మారింది.
చదువు.. ' కొంటున్నారు' !
నవతెలంగాణ- తొర్రూరు
తొర్రూరు మండలంలోనే 15 వేల 960 మంది విద్యా ర్థులు ఉండగా వీరిలో కేవలం 5000 మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు తెలుస్తోంది. సుమారు 10 వేల మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలను ఆశ్ర యిస్తున్నారు. కాగా ప్రైవేటు స్కూల్లలో ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తు న్నా జిల్లా విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. ప్రైవేటు స్కూల్లో వైపు కన్నెత్తి చూడడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చి సరిపెడుతున్నారు. విద్యార్థు లకు యూనిఫాంలు, పుస్తకాలు, షఉస్, బెల్ట్ అమ్మకాలు సాగుతున్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధం. కానీ నీ తమ వద్ద కొనుగోలు చేయాలని ఆదేశించడంతో తప్పనిసరై కొను గోలు చేయాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా రు. మరి కొన్ని స్కూల్లు తమతో ఒప్పందం ఉన్న షాపులోనే కొను గోలు చేయాలని సూచిస్తున్నాయి. ఇక పుస్తకాలు ఎంఆర్పి రేట్లకే అమ్ముతూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నాయి. సొంత గోదాములు ఏర్పాటు చేసుకొని పుస్తకాల విక్రయాలు సాగిస్తున్నారని తెలిసింది.
ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి : లవిశెట్టి ప్రసాద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు
జిల్లాలో ఇష్టారీతిన ప్రైవేట్ స్కూల్లు ఫీజులు వసూలు చేస్తున్న జిల్లా విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. అనేకసార్లు నిరసనలు, ధర్నాలు చేసినా నోటీసులు ఇచ్చి సరిపెడుతు న్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి. ఫీజుల దోపిడీని అరికట్టాలి.
అధికారుల తనిఖీలు లేవు : బంధు మహేందర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు.
ప్రైవేటు పాఠశాలలను విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయని పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు ప్రైవేటు పాఠశాలల పై చర్యలు తీసుకోవాలి.