Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల ఏర్పాటుకు నోచుకోని వైనం
- నాలుగు మండలాలకు కేంద్రం 20 పంచాయతీల నుండి తీర్మానాలు
- మొదటి, రెండవ విడత మండలాల ఏర్పాటులో జాప్యం
- మంత్రి ఎర్రబెల్లి దృష్టి పెట్టాలని ప్రజాప్రతినిధుల వినతి
నవతెలంగాణ-పాలకుర్తి/దేవరుప్పుల
పాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటి, రెండో విడతలో ఏర్పాటు చేసిన మండలాల ఏర్పాటులో మండలం ఏర్పాటుకు కోలుకొండ నోచుకోలేదు. మండలం ఏర్పాటు లో పాలకులు కోలుకొండ పట్ల సవతి తల్లి ప్రేమ చూపుచున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వరాష్ట్రం లో కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త మండలాల ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన సౌలభ్యం అందుబాటులో ఉండే లా 500 జనాభా కలిగిన గిరిజన తండాలను గ్రామపంచా యతీలుగా ఏర్పాటు చేసింది. దీంతో ఒక్కొక్క మండలానికి 20 నుండి 36 గ్రామాలు ఉన్నాయి. కోలుకొండ ను మండలంగా ఏర్పాటు చేయాలని మొదటి విడతలో ప్రజాప్రతినిధులు, చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. రెండో విడత మండలాల ఏర్పాటులో కోలుకొండకు చుక్కెదురైంది. పాలకుర్తి నియోజక వర్గం లోని దేవరుప్పుల మండల పరిధి కోలుకొండ దేవరుప్పుల మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దేవరుప్పుల, పాలకుర్తి, లింగాల గణపురం, రఘునా థపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలకు కోలుకొండ 10 కిలోమీటర్ల లోపు పరిధిలో ఉండడం, మండలం ఏర్పాటుకు అణువుగా అన్ని వసతులు ఉన్నప్పటికీ మండల కేంద్రంగా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోలుకొండను మండలం చేయాలని డిమాండ్ చేస్తూ దేవరుప్పుల మండలంలోని 14 గ్రామపంచాయతీలు, పాలకుర్తి మండలంలోని మూడు గ్రామపంచాయతీలు తీర్మానాలు చేశాయి. అవకాశం కల్పిస్తే లింగాల గణపురం మండలంలోని రెండు గ్రామపంచా యతీలు, రఘునాథపల్లి మండలంలోని నాలుగు గ్రామపంచాయ తీలు కోలుకొండను మండలం చేయాలని తీర్మానాలు చేసేందుకు సుముఖంగా ఉన్నాయి. జనగామ జిల్లా కేంద్రంతో పాటు పాలకుర్తి నియోజకవర్గం కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలుకొండను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులతో పాటు, ప్రజలు కోరుచున్నారు.
20 గ్రామాలకు పాలన అందుబాటులో....
కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుతో పాలకుర్తి మండలానికి 36 గ్రామాలు, దేవరుప్పుల మండలానికి 32 గ్రామాలు ఉన్నాయని, పాలన సౌలభ్యం మరింత అందు బాటులో ఉండేందుకు కోలుకొండను మండలం గా ఏర్పాటు చేస్తే సుమారు 20గ్రామాలకు పాలన అందుబాటులో ఉం టుందని పలువురు సర్పంచులు అభిప్రాయపడుచున్నారు. కోలుకొండను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ కోలుకొండ చుట్టూ ప్రక్కల గ్రామాల సర్పంచులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కోరారు. ప్రజలకు పాలన అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి మండలం ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.