Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్సైజ్ అధికారుల గైర్హాజరు
- చర్యల నిమిత్తం తీర్మానం
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
నవతెలంగాణ- స్టేషన్ఘనపూర్
ప్రజల్లో గుర్తుండిపోయేలా ప్రజాప్రతినిధులు, అధికా రులు పనులు చేయాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం ఎంపీపీ కందుల రేఖ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అభివద్ధి సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచిందని, ఇక్కడి అభివద్ధి పనులను చూసి ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాలు పాటిస్తున్నాయని అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ అధికారులు గొప్పగా పనిచేస్తున్నారని, 12769 పంచాయతీల్లో మునిపెన్నడు లేని విధంగా ఏకకాలంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అభినందించారు. ఫలితంగా దేశంలోని మొదటి 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రం నుంచి శుభ్రతలో గుర్తింపు పొందాయన్నారు. హరిత హారం ద్వారా రెండు వందల నలభై కోట్ల మొక్కలు నాటితే అటవీ సంపద 33 శాతానికి పెరిగిందన్నారు. ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో సమన్వయంతో పనిచేయాలన్నారు.
అంతకుముందు సభలో మూడు నెలలకోసారి జరిగే సర్వసభ్య సమావేశానికి ఎక్సైజ్‌శాఖ అధికారులు వరుసగా గైర్హాజర కావడంతో చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీలు తీర్మానించారు. నమిలిగొండ గ్రామంలో కందుల కొనుగోలు చేయాలని రైతుల తరపు సర్పంచ్ ఏఈఓని సమాచారం అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. అంగన ్‌వాడీ నిర్వహణ ఎలా జరుగుతుందో తమకి తెలియదని, ప్రజాప్రతినిధులంతా సీడీపీఓకు కనబడట్టుగా ఉందని, ఎన్ని సార్లు సమావేశాల్లో చెప్పినా ఇష్టారీతిన వ్యవహరిస్తుందని ఎంపీటీసీ గన్ను నర్సింహులు, బెల్లపు వెంకటస్వామి అన్నారు. నడి రోడ్డుపై గుంతలు ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పాలకుర్తి రోడ్డులో చాలా చోట్ల గుంతలు ఏర్పడిన పట్టించుకోరాని ఇప్పగూడెం సర్పంచ్ పర్షరాములు తెలుపగా చేస్తున్నామని త్వరలోనే మర మ్మత్తులు పూర్తిగా చేపడుతామని ఏఈ రవి సమాధా నమిచ్చారు. తాటికొండ గ్రామంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని తద్వారా అనేక సమస్యలు తలెత్తుతు న్నయని చెప్పినా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదని వైస్ ఎంపీపీపీ చల్లా సుధీర్ రెడ్డి లేవనెత్తారు. గ్రామంలోని పీహెచ్‌సీకి ప్రహరీ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతీ గ్రామంలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఎంఈఓ శ్రీవాణిని కోరారు. నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని శివుని పల్లిలో చెరువు చూస్తే అర్థమవుతుందని ఎంపిటిసి గుర్రం రాజు అన్నారు. చెరువులు, కుంటల్ని కాపాడాలని, వల్లభ రాయిని చెరువు నీరు అందిచాలని, ఎఫ్టీఎల్ హద్దులు ఏర్పాటు చేసి కాపా డాలని వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డి కోరారు. మిషన్ భగీరథ నీరు పూర్తిగా మురుగుగా వస్తున్న పట్టించుకోక, సరిపోనూ నీరు రావడం లేదని అదనంగా జీపీ లపై భారం పడుతుందని పాంనూర్ సర్పంచ్ కోతి రేణుక, ఎంపీటీసీ రజిత తెలుపగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సానుకూలంగా స్పం దించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇటీవల మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న రైతు భీమాను ఎమ్మెల్యే అందించారు. జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ మారపాక రవి, ఎంపీడీఓ కుమారస్వామి, తహసీల్ధార్ పూల్ సింగ్, ఏఓ చంద్రన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.