Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డివిజన్ వ్యాప్తంగా 40 శాతం మాత్రమే పంపిణీ
నవతెలంగాణ-తొర్రూరు
పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న పాఠ్యపుస్తకాలు పూర్తిసయిలో అందలేదు. ముద్రణ సరఫరా లో జాప్యంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభిస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం సకాలంలో బుక్స్ పంపిణీ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది కరోనా కారణంగా స్కూళ్లు ఆలస్యంగా ప్రారంభం అవ్వగా... ఈసారి విద్యాశాఖ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం గా మారింది. గతంలో స్కూలు పునర్ ప్రారంభానికి ముందే పుస్తకాలు విద్యా వనరుల కార్యాలయానికి చేరేవి. వేసవి సెలవుల చివరి రోజుల్లో పాఠశాలల ప్రధానోb ాధ్యాయులు వెళ్లి బుక్స్ తరలించేవారు. స్కూల్లు ప్రారంభమైన రెండు, మూడు రోజుల్లోనే వాటిని విద్యార్థులకు పంపిణీ చేసేవారు. కానీ ఈసారి సగం మేర పుస్తకాలు కూడా పాఠశాలలకు చేరలేదు. రెండు, మూడు నోటు పుస్తకాలు బ్యాగుల్లో పెట్టుకొని విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు.
తొర్రూరు డివిజన్ పరిధిలో తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, నర్సింహుల పేట, మరిపెడ, దంతాలపల్లి, చిన్న గూడూరు మండలాలు ఉన్నాయి. ఈ మండలాలకు సుమారు లక్షా 40 వేల పుస్తకాలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 70 వేల పుస్తకాలు మాత్రమే వచ్చాయి. తొర్రూరు మండలానికి 26వేల 500 పుస్తకాలు రావాల్సి ఉండగా 13 వేల 910 మాత్రమే వచ్చాయి. అలాగే నెల్లికు దురు మండలానికి 29వేల65 పుస్తకాలకు 15 వేల రెండు వందల తొంబై ఆరు వచ్చాయి. నర్సింల పేట మండలానికి 19 వేల పుస్తకాలకు పదివేల పుస్తకాలు, మరిపెడ మండలానికి 26,590 పుస్తకాలకు 14000 పుస్తకాలు, దంతాలపల్లి మండలానికి 14వేల నాలుగు వందలకు 7500 పుస్తకాలు, పెద్ద వంగర మండలానికి 11,700కు ఆరువేల పుస్తకాలు, చిన్నగూడూరు మండలానికి 6,500 పుస్తకా లకు గాను 3275 పుస్తకాలు మాత్రమే వచ్చాయి.
యూనిఫాంలో పై స్పష్టత కరువు..
ప్రభుత్వ పాఠశాలల యూనిఫాంలో పంపిణీ పై స్పష్టత కరువైంది. ఇప్పటివరకు దుస్తులు కుట్టేందుకు అవసరమైన వస్త్రాన్ని కూడా కొనుగోలు చేయని వైనం. దీంతో విద్యార్థులు నిత్యం సివిల్ డ్రెస్సుల్లోనే స్కూళ్లకు వెళ్తున్నారు. యూనిఫాంల పంపిణీకి స్వస్తి పలికిన సర్కారు వస్త్రం పంపిణీ చేసి కుట్టిస్తుంది. ఇప్పటికీ క్లాత్ రాకపోవడంతో యూనిఫాంలో అందచేతకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
40శాతం పుస్తకాలు వచ్చాయి...
ఇప్పటివరకు తొర్రూరు డివిజన్ పరిధిలోని మండలాలకు 40 శాతం పాఠ్యపుస్తకాలు వచ్చాయి. వీటిని పాఠశాలలకు పంపిణీ చేశారు. మిగిలిన బుక్స్ త్వరలోనే వస్తాయి. యూనిఫామ్లకు సంబంధించి క్లాత్ రాలేదు. వెంటనే కుట్టించి విద్యార్థులకు అందజేస్తాం.
- రాము, మండల ఇన్చార్జి విద్యాధికారి, తొర్రూరు