Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
సీఐటీయు వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రైతు సంఘం ఆధ్వ ర్యంలో సోమవారం నిత్యావసర సరుకు లు ధరలను తగ్గించాలని, సరుకులపై జిఎస్టిని ఎత్తివేయాలని సీఐటీయు, వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి పిలుపు మేరకు ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య మాట్లా డుతూ దేశం లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసు కొచ్చిన జీఎస్టీ ప్రజలపై మోయలేని భారమైందని ప్రపంచ వ్యాప్తం గా కరోనా సష్టించిన విలయతాం డవం కారణంగా కోట్లాదిమందికి ఉపాధి కరువైం దన్నారు. మన దేశంలో దాదాపు రూ.27 కోట్ల మం ది ఉద్యోగాలు కోల్పో యారని, గ్రామీణ ప్రాం తాల లో వ్యవసాయ కార్మికు లకు వ్యవసాయేతర కార్మికు లకు ఉపాధి కల్పించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమ య్యాయని విమర్శించారు. 2006లో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఈ చట్టానికి కేటా యించిన బడ్జెట్‌ను పక్క దారి పట్టించడమే కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ నిలిపివేయడంతో పట్టణ పేదలకు పనిలేక పస్తులు ఉంటున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ తీసు కువచ్చి రైతులను అయోమయానికి గురి చేస్తూ సా గులో ఉన్నటువంటి రైతులకు పట్టా పాస్ బుక్ ఇవ్వ కుండా రైతుబంధు పెట్టుబడి సహాయాన్ని లక్షలాది మంది రైతులకు ఇవ్వ కుండా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వకుండా పోడు వ్యవసా యాన్ని పోడు రైతుల ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు రుణమాఫీలు చేయడం లేదు రుణాలు ఇచ్చేది లేదు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాగో లేదని అన్నా రు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అసం ఘటితరంగ కార్మికులు ఆల్ హమాలీ రోడ్డు ట్రాన్స్‌ఫోర్టు ఆల్ మిల్ వర్కర్లు డొమెస్టిక్, షాపు వర్కర్లు ఇంకా అనేక మంది సంఘ టితంగా కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కోర బోయిన కుమారస్వామి, సీఐటీయు జిల్లా కన్వీనర్ అనంతగిరి రవి, రైతు సంఘం జిల్లా ఉపా ధ్యక్షులు మంజల సాయిలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపా ధ్యక్షులు నవీన్‌ల స్వామి, బోళ్ల సాంబయ్య ,బుర్రి ఆంజ నేయులు, సాంబరెడ్డి, శారద, మల్లయ్య, సదానందం, ఈశ్వరయ్య, సారయ్య, భద్రు, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.