Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు,
- రంగశాయిపేట ఏరియా కార్యదర్శి సాగర్
నవతెలంగాణ-మట్టెవాడ
రోజు వారీగా ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడు తూ పెరిగిన ధరలకు కుటుంబాన్ని పోషించేందుకు తిప్పలు పడుతున్నారని డ్రైవర్ల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు, రంగశాయిపేట ఏరియా కార్యదర్శి మాలోత్ సాగర్ డిమాండ్ చేశారు. జక్కలొద్దిలో సోమవారం నూతన ఆటో యూనియన్ కమిటీని ఎన్నుకున్నారు. జక్కలొద్ది ఏరియా కార్యదర్శి గానెపాక ఓదేలు అధ్యక్షతన జరిగిన సమాy ేశా నికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సాగర్ మాట్లాడుతూ పెరి గిన డీజిల్ ధరలకు ఆటో డ్రైవర్ల జీవితాలు భారంగా మా రాయన్నారు. పెరిగిపోయిన ఇంటి కిరాయిలు భరిం చ లేక గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారని అన్నా రు. ఆటోడ్రైవర్లు ఐక్యంగా ఉంటూ పేద ప్రజలు గుడిసెవాసులపై ప్రేమ ఆప్యా యతలు కలిగి మర్యాదగా నడు చుకోవాలని సూచించారు. డ్రైవ ర్లు ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఆపద సమయం వస్తే ఐక్యంగా నిలబడి ఆదుకునేలా యూనియన్ బలోపేతంగా ఉం డాలని పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్ల పిల్లలు మంచి చదువుల కోసం ఆర్థికంగా ఎదుగుదల కో సం పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకొని డబ్బులను ఆదా చేసు కోవాలని సూచించారు. ఆటో డ్రైవర్ లు, యూనిఫాంలో ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ ధ్రువపత్రాలు కలిగి ఉండాలని మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపకూడదన్నారు. కార్యక్రమంలో నూతన ఆటో డ్రైవర్స్ యూనియన్ కార్యవర్గం మొగుళ్ళ అనిల్, కార్యదర్శి పూనమ్ బాబురావు, ఉపాధ్యక్షులు మైదం రాజు, ఈర్ల హరినాథ్, మైదా భాష, బద్రు, ఎండి జమీల్, సహాయ కార్యదర్శి ఎండి సమీర్ ఎస్ కే ముస్తఫా, ఎస్ శరత్, కుమారస్వామి యాకయ్య చాగంటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.