Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసి హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్
నవతెలంగాణ-ములుగు
పార్లమెంటు సమావేశాల్లో గిరిజన యూని వర్సిటీ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ పార్లమెంటు సమావేశాల్లోనే గిరిజన యూనివర్సిటీ బిల్లు పార్ల మెంట్లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతి థిగా ఉపేందర్ హాజరై మాట్లాడుతూ 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ములుగు జిల్లా జాకారం కేంద్రంలోని గట్టమ్మ వద్ద గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారన్నారు. వైటిసి భవనంలో తాత్కాలిక తరగతులు ప్రారంభి స్తామ ని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని, ఏజెన్సీ గిరిజన వెనుకబడిన ప్రాంతం ఉన్నత విద్యా రంగంలో వెనుకబడిన ములుగు ఏజె న్సీ ఆదివాసి ప్రాంతం ఉన్నత చదు వులు చదవలేక ఆది వాసీలు చదువుకు దూరం అవుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆది వాసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొడెం కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయకుంటే వేరే ప్రాంతానికి తరలి వెళ్తే ఊరుకునే ప్రసక్తేలేదన్నారు. మాజీ మున్సిపల్ కమి షనర్ దేవ్‌సింగ్ మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీ మా ఆత్మగౌరవ సమస్య అని గిరిజన యూనివర్సిటీ కోసం రాజకీయాలకతీతంగా ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొలిపాక ప్రశాంత్ గుట్టమీద ముసలయ్య, ఆలయ ప్రచార కార్యదర్శి గుండె మీద వెంకటేశ్వర్లు, విజేందర్‌రెడ్డి, రాహుల్, వాజేడు జడ్పిటిసి పుష్పలత పాల్గొన్నారు.