Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16 వర్ధంతి సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
వీర తెలంగాణ సాయుద పోరాట విప్లవ యోధుడు, నాటి భూస్వామ్య నిజాం రజాకారు దౌరన్యాలను ఎదిరించేలా ప్రజల్లో విప్లవాగ్నిని రగిలించిన విప్లవ ధవతార కాచం కృష్ణమూర్తి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో కాచం కష్ణమూర్తి 16వ వర్ధంతిని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజా అధ్యక్షతన నిర్వహించారు. కష్ణ మూర్తి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పిం చారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకపోతా మని ప్రతినబూనారు. ఈ సందర్భంగా మోకు కనకా రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంలో సముచిత పాత్రను అమరజీవి కాచం కష్ణమూర్తి పోశించార న్నారు. గ్రామాల్లో ప్రజలను చైతన్యపరచడం , అడవుల్లో ధళాలను నడపడం ఆయన రోజువారి కార్యక్రమంగా ఉండేదని అన్నారు. అజ్ఞాత జీవితంలో రాజన్న గా వెలుగొం దాడని అన్నారు. ఇప్పటికీ నల్లగొండ రంగారెడ్డి జిల్లాలో నాటి పోరాట ప్రస్తాన వచ్చినపుడు రాజన్న పేరు మార్మోగు తుందన్నారు. పోరాట కాలంలోనే అడవుల్లో వున్నపుడు తన దళ సభ్యురాలు శారదమ్మను వివాహం చేసుకున్నాడన్నారు. నేటి జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నిర్మాల గ్రామంలో 1921 లో కాచం యశోదమ్మ రాంచంద్రయ్య దంపతులకు జన్మించారని తెలిపారు. 2006లో ఆనారో గ్యంతో మరణించారని, ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తి, ఆదర్శజీవితం నేటి తరానికీ స్ఫూర్తిదాయకమన్నారు. పాలక వర్గాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి వెంకట్రాజం, ఇర్రి అహల్య, సింగారపు రమేష్, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా చందునాయక్, పార్టీ నాయకులు మైలారపు వెంకటేశ్వర్లు, దడిగే సందీప్, తేజావత్ గణేష్, చీర రజిత, కొండ వరలక్ష్మి, అన్నేబోయిన రాజు, గడిమల్ల రవి, పోత్కునూరి కనకాచారి, తదితరులు పాల్గొన్నారు.
సాయుధ పోరాట ఆణిముత్యం కాసం కష్ణమూర్తి : ఎదునూరి వెంకట్రాజం
నవతెలంగాణ-దేవరుప్పుల
నాడు తెలంగాణలో జరిగిన నిజాం వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో ముఖ్య భూమిక పోషించి భూ సమస్యకు పరిష్కార మార్గం చూపిన గొప్ప నాయకుడు కష్ణమూర్తి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదునూరి వెంకట్రాజం అన్నారు. మండలం లోని నీర్మాల గ్రామంలో(కష్ణమూర్తి స్వగ్రామం) పయ్యావుల బిక్షపతి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన కష్ణమూర్తి 16వ వర్ధంతి సభలో ఆయన పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం కృష్ణమూర్తి స్మారక స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించి వెంకట్రాజం మాట్లాడారు. దున్నేవాడికే భూమి కావాలని, వెట్టి చాకిరి నుంచి విముక్తి లభించాలని, వత్తిదారులకు హక్కులు కల్పించాలని,కౌలుదారులకు భూములపై హక్కులు కల్పించాలని అన్నారు. నాటి పోరాటంలో భూస్వాములు,నైజాం ప్రైవేట్ సైన్యం అయిన రజాకార్లు ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా ఎదురొడ్డి పోరాడి పేదలకు భూములు సాధించి పెట్టిన కష్ణమూర్తి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సింగారపు రమేష్, రైతు సంఘం మండల నాయకుడు కాసర్ల మాధవరెడ్డి, యాదవరెడ్డి, ఇంటి వెంకట్ రెడ్డి,నల్ల మల్లయ్య, సింగారపు ఆయోధ్య, కాడబోయిన అంజనేయులు, వడ్లకొండ సత్తయ్య, శ్రీరాములు,ఎండీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక తెలంగాణ పోరాట వేదిక ఆధ్వర్యంలో
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో సామాన్య ప్రజల ఏ ఒక్క మౌలిక సమస్య కూడా పరిష్కారం కాలేదని.. అందుకు కష్ణమూర్తి లాంటి పోరాట యోధుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని పోరాటాలు కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని సామాజిక తెలంగాణ పోరాట వేదిక నాయకులు కొత్తగట్టు మల్లయ్య పిలుపు నిచ్చారు. సోమవారం పార్టీ జెండాను ఆవిష్కరించి, విష్ణుమూర్తి స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సామాజిక వేదిక నాయకులు ఫతేపురం యాదగిరి, నలుగురి రమేష్, జంపాల మల్లయ్య, బోర్ల ప్రభాకర్, ఏడుకొండలు తదితరులతో పాటు కష్ణమూర్తి సహచరులు పాల్గొన్నారు.