Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కార్మిక సంక్షేమమే ధ్యేయంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఉందని, అటు రైతుల మేలు, ఇటు మార్కెట్ హమాలీలు, దడ్వాయిలా సంక్షేమం కోసం పని చేస్తుందని మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు పేర్కొన్నారు. సోమవారం మార్కెట్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్న హమాలీ కూలీలు, మహిళలు 150, పురుషులు 317, దడ్వాయిలు 34మందికి మొత్తంగా 501మందికి యూనిఫామ్స్ అందజేశారు. ఈసందర్బంగా చైర్మెన్ మాట్లాడుతూ కేసముద్రం మార్కెట్ లో పనిచేస్తున్న హమాలీ, కూలీ కార్మికులు, దడ్వాయిలు తగిన గుర్తింపుతోపాటు వారికి అండగా ఉండి పూర్తిస్థాయి హక్కులు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. మార్కెట్లో పనిచేసే కార్మికులకు యాక్సిడెంట్ స్కీం ద్వారా గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా చేయించడానికి సానుకూలంగా ఉన్నామని అన్నారు. కార్మికులకు మార్కెట్ యార్డులోనే వైద్య సౌకర్యం అందేలా హాస్పిటల్ సౌకర్యం కల్పిస్తున్నామని, కార్మికులకు, రైతులతో పాటుగా మార్కెట్కఉ వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు కల్పించడంలో తన వంతు కషి చేస్తానని అన్నారు. కొన్ని ట్రేడింగ్ కంపెనీలు, మిల్లులలో కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడంతో బస్తాలు నింపడం ,తూకం వేయడానికి ఆలస్యం అవుతోందన్నారు. సంబంధిత వ్యాపారులు ఉన్న కార్మికులనే విభజన చేసి కొంత మందిని మార్కెట్కు పంపి, కొంత మందిని మిల్లు, ట్రేడింగ్ కంపెనీ వద్ద పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై త్వరలో సమావేశం నిర్వహిస్తామని, అన్ని కార్మిక సంఘాలు కార్మికుల విభజనకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక యూనియన్ నాయకులు కంచ వెంకన్న, శివారపు శ్రీధర్, మంద భాస్కర్, దడ్వాయి సంఘం నాయకులు, హమాలీ, కూలీ పెద్ద మనుషులు, సూపర్ వైజర్ రాజేందర్, సిబ్బంది భాస్కర్, పెద్దగాని రాము తదితరులు పాల్గొన్నారు.