Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాడ్మింటన్ క్లబ్ కార్యదర్శి రవీందర్రావు, డీవైఎస్ఓ అశోక్
- జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాపోటీలు ప్రారంభం
నవతెలంగాణ-ఎన్జీఓస్ కాలనీ
క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని వరంగల్ క్లబ్ కార్యదర్శి రవీందర్‌రెడ్డి, డీవైఎస్ఓ అశోక్ తెలిపారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రమేష్‌కుమార్, డాక్టర్ రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా స్థాయి ఎంపిక క్రీడాపోటీలను సుబేదారిలోని ఆఫీసర్స్ క్లబ్లో సోమవారం నిర్వహించగా ముఖ్యఅతిథులుగా రవీందర్‌రెడ్డి, అశోక్ హాజరై మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు బ్యాడ్మింటన్‌కు ప్రపంచ స్థాయిలో దేశానికి గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు. వారి స్పూర్తితో క్రీడాకారులు ప్రతిభ చాటి జిల్లాకు, రాష్ట్రానికి గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ టోర్నమెంట్లో ఆరు ఏజ్ గ్రూపులతో స్త్రీ, పురుష విభాగాల్లో సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్ మొత్తంగా 153 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ మూల జితేందర్‌రెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ శోభన్‌కుమార్, అసోసియేషన్ కోశాధికారి డి నాగ కిషన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మ మోహన్‌రావు, విటి ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ సత్యనారెడ్డి, టెక్నికల్ అఫీషియల్స్ చీఫ్ రెఫరీ కొమ్ము రాజేందర్, శ్యాంకుమార్, మ్యాచ్ కంట్రోలర్ కిషోర్, ప్రసాద్, శ్రీధర్, భాస్కర్, శైలజ, అరుణ్, వెంకటస్వామి, మహేష్, నాగరాజు కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.