Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకున్న గుడిసెవాసులు
నవతెలంగాణ-కాశిబుగ్గ
చిన్నవడ్డేపల్లి చెరువు శిఖం భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలను దహనం చేయడానికి సోమవారం అధికారులు ప్రయత్నించగా గుడిసె వాసులు అడ్డుకున్నారు. సర్వే నెంబర్ 300 చిన్న వడ్డేపల్లి చెరువు శిఖం భూమిలో పేదలు నెల రోజుల క్రితం సిపిఐ(ఎం)పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుంటే అధికారులు వాటిని దహనం చేశారు. పేదలు మళ్లీ అదే స్థలంలో గుడిసెలు వేసుకున్నారు. సోమవారం మరోసారి వరంగల్ తహసిల్దార్ సత్య పాల్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులు గుడిసెల దహనానికి ప్రయత్నించగా పేదలు అడ్డుకున్నారు. అధికారులతో తీవ్ర వాగ్వి వాదం చేశారు. కబ్జాదారులు వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమిస్తుంటే చూస్తూ ఉం టున్న అధికారులు పేదలు గుడిసెలు వేసుకుంటే మాత్రం అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సం దర్భంగా సిపిఐ(ఎం) కాశిబుగ్గ ఏరియా కమిటీ కార్య దర్శి ఎండి.బషీర్ మాట్లాడుతూ టిఆర్ఎస్ అధికా రంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ పేదలకు ఇండ్లు ఇవ్వలేదని మండి పడ్డారు. నగరంలో 20వేల మంది నివాస స్థలాల కోసం దరఖాస్తు చేసుకు న్నారని అన్నారు. ప్రభుత్వ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకుంటే అధికారులు భయభ్రాంతులకు గురి చేయడం సరికా దన్నారు. నగరంలో ఉన్న ప్రభుత్వ భూ ములను బయటకు తీసి పేదలకు ఇంటి స్థలాలు ఇస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం పేదలకు నివాస స్థలాలు ఇచ్చి పక్కా ఇండ్లు కట్టించాలని కోరారు. లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటాలు చేస్తామని హెచ్చ రించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోవ ర్ధన్ రాజ్, కళ్యాణి, సునీత, సురేష్, అరుణ, చైతన్య, సుజాత, అనిత, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.