Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీక్షలకు మద్దతు తెలుపుతున్న ప్రజా సంఘాలు
నవతెలంగాణ-ములుగు
మల్లంపల్లిని మండలం ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు ఉద్యమాలను ఉదతం చేస్తున్నారు. మండల సాధన సమితి ఆధ్వర్యంలో సోమ వారం 6వ రోజు రేలే నిరాహార దీక్ష మల్లంపల్లి బైక్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్స్ పాల్గొన్నారు. కార్యక్ర మంలో ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొని రీతిలో ద్వారా తమ ఆకాంక్షను ప్రభుత్వం తెలియజేయడం జరిగినందుకు, సాధ న సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు కృతజ్ఞతలు తెలిపారు,
కరపత్రాల ఆవిష్కరణ
సోమవారం నిర్వహిస్తున్న బైక్ అసోసియేషన్, రిలా నిరాహార దీక్షకు సంఘీభావంగా వివిధ రాజకీయ పార్టీలు తమ మద్దతు తెలిపారు. జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతి ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం స్పందించి మల్లంపల్లి మండల ఏర్పాటు, వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీక్షకు సంఘీభావంగా, తెలంగాణ వైఎస్ ఆర్ పార్టీ మొలు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి సంఘీ భావం తెలిపారు. కార్యక్రమంలో బైక్ మెకానిక్ సభ్యులు ఆల్ టు వీలర్ వెల్ఫేర్ సొసైటీ మల్లంపల్లి మెకానిక్ యూనియన్ మల్లంపల్లి అధ్యక్షుడు గొట్టిముక్కుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నల్లెల రాజేష్, కార్యదర్శి అల్లం ప్రశాంత్, కోశాధికారి గొట్టిముక్కల నరేష్, సహాయ కార్యదర్శి శ్రీరామోజు రమేష్ చారి, సలహాదారులు కందగట్ల నాగరాజు, భూమ అనిల్, సత్యం, తదితరులు పాల్గొన్నారు.
మండలంగా ప్రకటించకపోవడం దుర్మార్గం
మల్లంపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆరవ రోజు సోమవారం మల్లంపల్లి మండల సాధన సమితి ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న దీక్షా శిబిరం వద్దకు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల 14 మండలాలు చేసిన మల్లంపల్లిని మండలంగా ప్రకటించకపోవడం మల్లంపల్లి ప్రాంత వాసులను మోసం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ములుగు, తాడ్వాయి మండలాల అధ్యక్షులు కొండ బోయిన దిలీప్, భాగే నరసింహులు, ఎల్లబోయిన బిక్షపతి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.